అమెరికాకు అజిత్ దోవల్ వార్నింగ్..! భారత్‌ను బెదిరిస్తే ఊరుకునేది లేదు! AP Health Dept: రక్తహీనత బాధితులకు ఊరట.. బాలింతలతో పాటు గర్భిణీలకు ఎఫ్‌సీఎం పంపిణీ.!! రాష్ట్రంలో మరో మెగా ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్..! వేల కోట్ల నిధులతో.. మారనున్న రూపురేఖలు! Jammu Kashmir News: మరోసారి నోరు పారేసుకున్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్! రైతుల ఖాతాల్లోకి రూ.9,300 కోట్లు! 24 గంటల్లోనే నగదు జమ చేస్తున్న కూటమి ప్రభుత్వం! Land Passbooks Distribution: భూమి-మీ హక్కు'తో రైతులకు భరోసా.. కర్నూలు జిల్లాలో నేడు ముఖ్యమంత్రి పర్యటన.!! Navy Events: వైజాగ్‌లో యుద్ధ నౌకల సందడి.. సీఎం ఆదేశాలతో వీఎంఆర్డీఏ భారీ ఏర్పాట్లు.!! AP Labour Schemes: భవన నిర్మాణ కార్మికులకు గుడ్ న్యూస్... పెళ్లికానుక, ప్రసూతి సాయం పథకాలకు సీఎం గ్రీన్ సిగ్నల్! ఏపీలో ఇక వాటిపై జీఎస్టీ ఉండదు...! సీఎం చంద్రబాబు హామీ! ఏపీ ప్రజలకు తీపికబురు..! భారీగా తగ్గనున్న విద్యుత్ ఛార్జీలు! అమెరికాకు అజిత్ దోవల్ వార్నింగ్..! భారత్‌ను బెదిరిస్తే ఊరుకునేది లేదు! AP Health Dept: రక్తహీనత బాధితులకు ఊరట.. బాలింతలతో పాటు గర్భిణీలకు ఎఫ్‌సీఎం పంపిణీ.!! రాష్ట్రంలో మరో మెగా ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్..! వేల కోట్ల నిధులతో.. మారనున్న రూపురేఖలు! Jammu Kashmir News: మరోసారి నోరు పారేసుకున్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్! రైతుల ఖాతాల్లోకి రూ.9,300 కోట్లు! 24 గంటల్లోనే నగదు జమ చేస్తున్న కూటమి ప్రభుత్వం! Land Passbooks Distribution: భూమి-మీ హక్కు'తో రైతులకు భరోసా.. కర్నూలు జిల్లాలో నేడు ముఖ్యమంత్రి పర్యటన.!! Navy Events: వైజాగ్‌లో యుద్ధ నౌకల సందడి.. సీఎం ఆదేశాలతో వీఎంఆర్డీఏ భారీ ఏర్పాట్లు.!! AP Labour Schemes: భవన నిర్మాణ కార్మికులకు గుడ్ న్యూస్... పెళ్లికానుక, ప్రసూతి సాయం పథకాలకు సీఎం గ్రీన్ సిగ్నల్! ఏపీలో ఇక వాటిపై జీఎస్టీ ఉండదు...! సీఎం చంద్రబాబు హామీ! ఏపీ ప్రజలకు తీపికబురు..! భారీగా తగ్గనున్న విద్యుత్ ఛార్జీలు!

Congress vs BJP: కాంగ్రెస్ తీరుపై మోదీ గర్జన.. రైతులను మోసం చేసింది వారే!

రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. కాంగ్రెస్ హయాంలోని NPAల సంక్షోభం, బ్యాంకింగ్ రంగ వైఫల్యాలు, మరియు రైతుల పట్ల విపక్షాల వివక్షను ఎండగట్టారు. భారత్ అతి త్వరలో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని ప్రధాని స్పష్టం..

Published : 2026-02-06 07:00:00

పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విపక్షాలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ, సుమారు గంటన్నరకు పైగా సాగిన తన ప్రసంగంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ గత వైఫల్యాలను ఎండగట్టడమే కాకుండా, ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశం సాధిస్తున్న ప్రగతిని వివరించారు. దేశం ప్రస్తుతం సరైన మార్గంలో, అత్యంత వేగంతో పురోగమిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు

ఒకప్పుడు భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉండేదని మోదీ విమర్శించారు. అయితే, తమ ప్రభుత్వ హయాంలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాల వల్ల భారత్ ప్రస్తుతం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, త్వరలోనే మూడవ స్థానానికి చేరుకోవడం ఖాయమని స్పష్టం చేశారు. ఎక్స్‌ప్రెస్‌ వేగంతో సంస్కరణలు అమలవుతున్నాయి 9 దేశాలతో భారత్‌ ఇప్పటికే ట్రేడ్‌ డీల్‌ కుదుర్చుకుంది అని ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ ఒక మార్గదర్శిగా నిలుస్తోందని ప్రధాని గర్వంగా ప్రకటించారు.

రైతు సంక్షేమం - కాంగ్రెస్ నమ్మకద్రోహం

కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల కాలం పాటు దేశంలోని చిన్న, సన్నకారు రైతులను విస్మరించిందని మోదీ ఆరోపించారు. 10 కోట్ల మంది చిన్న రైతుల గోడును గత ప్రభుత్వం పట్టించుకోలేదని, కానీ తమ ప్రభుత్వం 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకి రూ. 4 లక్షల కోట్లు జమ చేసిందని వివరించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులు ఇప్పటికీ అనేక కష్టాలు పడుతున్నారని, వారిని ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేశారని మండిపడ్డారు.

బ్యాంకింగ్ రంగంపై విమర్శలు

యూపీఏ పాలనలో బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని, విచ్చలవిడిగా రుణాలు ఇవ్వడం వల్ల ఎన్‌పీఏలు  కొండలా పేరుకుపోయాయని మోదీ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ధైర్యంగా బ్యాంకింగ్ సంస్కరణలు చేపట్టామని, తద్వారా నేడు బ్యాంకులు లాభాల బాటలో పయనిస్తున్నాయని తెలిపారు.

పశ్చిమ బెంగాల్ పరిస్థితిపై ఆవేదన

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పాలనలో పశ్చిమ బెంగాల్ యువత భవిష్యత్తు అంధకారంలో పడిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులకు టీఎంసీ ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని, ఇది దేశ భద్రతకు ముప్పు అని హెచ్చరించారు. 

రాహుల్ గాంధీ తీరుపై ధ్వజం

సభలో ప్రతిపక్షాల తీరును తప్పుబడుతూ, చర్చను తట్టుకోలేక విపక్షాలు అలిసిపోయి సభ నుంచి పారిపోయాయని మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎంపీ బిట్టును ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రధాని తీవ్రంగా ఖండించారు. ఒక సిక్కు ఎంపీని 'ద్రోహి' అని పిలవడం వారి అహంకారానికి నిదర్శనమని, సిక్కుల పట్ల కాంగ్రెస్ మనసులో ఉన్న ద్వేషం ఆ మాటల్లో బయటపడిందని విమర్శించారు.

కాంగ్రెస్ చేసిన తప్పులను సరిదిద్దడానికి తమకు చాలా సమయం పట్టిందని, కానీ ప్రస్తుతం దేశం అన్ని రకాల సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని మోదీ స్పష్టం చేశారు. దేశంలో ప్రతిభావంతులైన యువతకు కొరత లేదని, వారి కలల సాకారమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధాని తెలిపారు

Spotlight

Read More →