AP Fee Reimbursement: యువగళం హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలతో పేద విద్యార్థులకు భరోసా! Chandrababu Naidu: కూటమి ఐక్యతే ఏపీ అభివృద్ధి మంత్రం..! చంద్రబాబు క్లారిటీ! AP Politics: పాత గణాంకాలతో బురదజల్లే ప్రయత్నం..! వైసీపీ ‘పేటీఎం బ్యాచ్‌ల’పై అచ్చెన్నాయుడు ఫైర్! Group1Scam: ఏపీ గ్రూప్-1 అక్రమాలపై సిట్ విచారణకు హైకోర్టు సంచలన తీర్పు! AP Cabinet Meeting Decisions: సౌర విద్యుత్, బయోగ్యాస్ ప్లాంట్లకు భూ కేటాయింపు.. ఆ ప్రాంతంలో 1500 ఎకరాలు కేటాయింపు.!! AP Assembly Budget Session Strategy: కుల, మత చిచ్చు పెట్టాలని వైకాపా ప్లాన్.. ఎన్డీఏ భేటీలో చంద్రబాబు పవన్ కీలక వ్యాఖ్యలు.! AP Assembly Satirical Comments : 11వ తేదీ.. 11 మంది.. 11 నిమిషాలు వైకాపా తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సెటైర్లు! AP Budget 2026 ఎంతసేపు మాట్లాడామన్నది కాదు.. ఏం చెప్పామన్నదే ముఖ్యం.. అసెంబ్లీలో కొత్త సంప్రదాయానికి పయ్యావుల పిలుపు..!! AP Ministers: ఏపీలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల బెదిరింపు లేఖలు! కుటుంబ సభ్యుల్లో ఆందోళన... AP Budget 2026 Date: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ షెడ్యూల్ ఖరారు.. మార్చి 7 వరకు సమావేశాలు 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం..!! AP Fee Reimbursement: యువగళం హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలతో పేద విద్యార్థులకు భరోసా! Chandrababu Naidu: కూటమి ఐక్యతే ఏపీ అభివృద్ధి మంత్రం..! చంద్రబాబు క్లారిటీ! AP Politics: పాత గణాంకాలతో బురదజల్లే ప్రయత్నం..! వైసీపీ ‘పేటీఎం బ్యాచ్‌ల’పై అచ్చెన్నాయుడు ఫైర్! Group1Scam: ఏపీ గ్రూప్-1 అక్రమాలపై సిట్ విచారణకు హైకోర్టు సంచలన తీర్పు! AP Cabinet Meeting Decisions: సౌర విద్యుత్, బయోగ్యాస్ ప్లాంట్లకు భూ కేటాయింపు.. ఆ ప్రాంతంలో 1500 ఎకరాలు కేటాయింపు.!! AP Assembly Budget Session Strategy: కుల, మత చిచ్చు పెట్టాలని వైకాపా ప్లాన్.. ఎన్డీఏ భేటీలో చంద్రబాబు పవన్ కీలక వ్యాఖ్యలు.! AP Assembly Satirical Comments : 11వ తేదీ.. 11 మంది.. 11 నిమిషాలు వైకాపా తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సెటైర్లు! AP Budget 2026 ఎంతసేపు మాట్లాడామన్నది కాదు.. ఏం చెప్పామన్నదే ముఖ్యం.. అసెంబ్లీలో కొత్త సంప్రదాయానికి పయ్యావుల పిలుపు..!! AP Ministers: ఏపీలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల బెదిరింపు లేఖలు! కుటుంబ సభ్యుల్లో ఆందోళన... AP Budget 2026 Date: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ షెడ్యూల్ ఖరారు.. మార్చి 7 వరకు సమావేశాలు 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం..!!

AP Shivaratri power supply: శివరాత్రి వేళ అంతరాయం లేకుండా విద్యుత్ అందించాలి.. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశాలు!

Maha Shivaratri power supply: మహా శివరాత్రి పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ డిస్కమ్‌లకు ఆదేశాలు జారీ చేశారు...

Published : 2026-02-11 21:29:00
  • AP Shivaratri power supply: శివరాత్రికి నిరంతర సరఫరా
  • డిస్కమ్‌లకు మంత్రి ఆదేశాలు
  • 24 గంటల మెయింటెనెన్స్ బృందాలు

మహా శివరాత్రి (Maha Shivaratri) పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలు  పరిసర ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరాలో ఏ విధమైన అంతరాయం లేకుండా నాణ్యమైన నిరంతర విద్యుత్‌ సరఫరా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంధన శాఖా  మంత్రి  గొట్టిపాటి రవికుమార్‌ (Gottipati Ravikumar) ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో పని చేయాలని ఆయన స్పష్టం చేశారు.

నేడు డిస్కమ్‌ల సీఎండీలు ఎల్‌.శివశంకర్‌, ఐ.పృధ్వీ తేజ్‌,  పి.పుల్లారెడ్డి లతో పాటు విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులతో  మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శివరాత్రి పండుగను (AP Shivaratri power supply) దృష్టిలో ఉంచుకుని విద్యుత్‌ సరఫరా సన్నద్ధతపై ఆయన సమీక్షించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ప్రధాన శివాలయాలు ఇతర దేవాలయాలకు వెళ్లే అవకాశం ఉన్నందున, నిరంతర విద్యుత్‌ సరఫరా అత్యంత అవసరం అని మంత్రి పేర్కొన్నారు. భక్తుల సౌకర్యం కోసం ధార్మిక కార్యక్రమాలు అంతరాయం లేకుండా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.

పండుగ రోజుల్లో విద్యుత్‌ అంతరాయాలు లేకుండా  ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అవసరమైతే ప్రత్యామ్న్యాయ విద్యుత్‌ అందించేలా ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించేందుకు 24 గంటల  మెయింటెనెన్స్‌ బృందాలు సిద్ధంగా ఉండాలని  సూచించారు. అనుకోని సమస్యలు తలెత్తకుండా ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ పంపిణీ లైన్లపై ముందస్తు తనిఖీలు  నిర్వహించాలని ఆయన సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా తక్షణ పునరుద్ధరణ చర్యలు చేపట్టేలా సిద్ధంగా ఉండాలని, ఫీల్డ్‌ అధికారులందరూ  అలర్ట్‌ గా  ఉండి కచ్చితమైన పర్యవేక్షణ కొనసాగించాలని మంత్రి ఆదేశించారు.

ఎటువంటి  అంతరాయం లేకుండా ఉండేలా చూడటం ముఖ్యమని అత్యవసర పరిస్థితుల్లో తక్షణ పునరుద్ధరణ చర్యలు చేపట్టేలా ఫీల్డ్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. మహా శివరాత్రి సందర్భంగా భక్తులు భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకునేలా ప్రతి డిస్కమ్ సమర్థవంతంగా పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు.

Spotlight

Read More →