AP Assembly Budget Session Strategy: కుల, మత చిచ్చు పెట్టాలని వైకాపా ప్లాన్.. ఎన్డీఏ భేటీలో చంద్రబాబు పవన్ కీలక వ్యాఖ్యలు.! AP Assembly Satirical Comments : 11వ తేదీ.. 11 మంది.. 11 నిమిషాలు వైకాపా తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సెటైర్లు! AP Budget 2026 ఎంతసేపు మాట్లాడామన్నది కాదు.. ఏం చెప్పామన్నదే ముఖ్యం.. అసెంబ్లీలో కొత్త సంప్రదాయానికి పయ్యావుల పిలుపు..!! AP Ministers: ఏపీలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల బెదిరింపు లేఖలు! కుటుంబ సభ్యుల్లో ఆందోళన... AP Budget 2026 Date: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ షెడ్యూల్ ఖరారు.. మార్చి 7 వరకు సమావేశాలు 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం..!! Bharath Bandh: దేశవ్యాప్తంగా భారత్ బంద్... ఎందుకు? ఏమిటి? Amaravati: అమరావతే శాశ్వత రాజధాని.. మూడు రాజధానుల ప్రతిపాదనపై గవర్నర్ విమర్శలు! AP Assembly: అసెంబ్లీలో గవర్నర్ సంచలన ప్రసంగం... గత ఐదేళ్లలో ఏపీ విధ్వంసం! రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయం.. GHMC: జీహెచ్‌ఎంసీ మూడు ముక్కలు.. కొత్త కార్పొరేషన్లు ఇవే! వారికి కీలక బాధ్యతలు! CPI: అవినీతి సూచీలో భారత్‌కు స్వల్ప ఊరట..! సీపీఐ నివేదికలో ఆసక్తికర వివరాలు! AP Assembly Budget Session Strategy: కుల, మత చిచ్చు పెట్టాలని వైకాపా ప్లాన్.. ఎన్డీఏ భేటీలో చంద్రబాబు పవన్ కీలక వ్యాఖ్యలు.! AP Assembly Satirical Comments : 11వ తేదీ.. 11 మంది.. 11 నిమిషాలు వైకాపా తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సెటైర్లు! AP Budget 2026 ఎంతసేపు మాట్లాడామన్నది కాదు.. ఏం చెప్పామన్నదే ముఖ్యం.. అసెంబ్లీలో కొత్త సంప్రదాయానికి పయ్యావుల పిలుపు..!! AP Ministers: ఏపీలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల బెదిరింపు లేఖలు! కుటుంబ సభ్యుల్లో ఆందోళన... AP Budget 2026 Date: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ షెడ్యూల్ ఖరారు.. మార్చి 7 వరకు సమావేశాలు 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం..!! Bharath Bandh: దేశవ్యాప్తంగా భారత్ బంద్... ఎందుకు? ఏమిటి? Amaravati: అమరావతే శాశ్వత రాజధాని.. మూడు రాజధానుల ప్రతిపాదనపై గవర్నర్ విమర్శలు! AP Assembly: అసెంబ్లీలో గవర్నర్ సంచలన ప్రసంగం... గత ఐదేళ్లలో ఏపీ విధ్వంసం! రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయం.. GHMC: జీహెచ్‌ఎంసీ మూడు ముక్కలు.. కొత్త కార్పొరేషన్లు ఇవే! వారికి కీలక బాధ్యతలు! CPI: అవినీతి సూచీలో భారత్‌కు స్వల్ప ఊరట..! సీపీఐ నివేదికలో ఆసక్తికర వివరాలు!

AP Budget 2026 ఎంతసేపు మాట్లాడామన్నది కాదు.. ఏం చెప్పామన్నదే ముఖ్యం.. అసెంబ్లీలో కొత్త సంప్రదాయానికి పయ్యావుల పిలుపు..!!

AP Budget 2026 Payyavula Keshav: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సభ్యులు ఎలా మాట్లాడాలో మంత్రి పయ్యావుల కేశవ్ కీలక సూచనలు చేశారు... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుఅనుసరించిన 7 నిమిషాల వ్యూహాన్ని ఉదాహరణగా చూపుతూ పిలుపునిచ్చారు.

Published : 2026-02-11 15:55:00

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై జరిగిన బీఏసీ చర్చల అనంతరం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Kesav) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభలో ప్రజా ప్రతినిధులు ఎంత సమయం మాట్లాడారు అనే దానికంటే ఎంత విలువైన సమాచారాన్ని ప్రజలకు  ఇస్తున్నామనేది అత్యంత ప్రధానమని  తెలిపారు. 
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనితీరును ఆయన అనుసరిస్తున్న అంతర్జాతీయ ప్రమాణాలను మంత్రి ఉదాహరణగా పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇటీవలి దావోస్ పర్యటనలో అనుసరించిన వ్యూహాలను సభ్యులందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, తక్కువ సమయంలోనే అద్భుతమైన ఫలితాలను ఎలా సాధించవచ్చో ఆయన చేసి చూపారని పయ్యావుల కేశవ్ కొనియాడారు.
దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరుపై మంత్రి విశ్లేషిస్తూ ప్రతి నిమిషాన్ని ఆయన ఎంత విలువైనదిగా భావించారో వివరించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు తాను కలిసే ప్రతి పారిశ్రామిక సంస్థపై ముందస్తుగా లోతైన కసరత్తు చేశారని ఆ సంస్థ నేపథ్యం  రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలపై స్పష్టమైన అవగాహనతో సమావేశాలకు హాజరయ్యారని కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే ఆయా సంస్థల ప్రతినిధులకు రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలను, ప్రభుత్వ ప్రాధాన్యతలను సమర్థవంతంగా వివరించి సమావేశాలను ముగించేవారని మంత్రి పేర్కొన్నారు.  సీఎం చూపిన ఈ పనితీరును  శాసనసభలో సభ్యులు కూడా ఒక పాఠంగా తీసుకోవాలని పయ్యావుల కేశవ్ సూచించారు.

సభలో గంటల తరబడి ప్రసంగాలు చేయడం వల్ల సమయం వృథా కావడమే తప్ప ఫలితం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. సభ్యులు తమ నియోజకవర్గ సమస్యలైనా  ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశాలైనా తక్కువ  వ్యవధిలో విషయాన్ని మొత్తం చెప్పే కళను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో ప్రతి నిమిషం ప్రజల సొమ్ముతో ముడిపడి ఉంటుందని.. సభ్యులు అనవసర ప్రసంగాలకు పోకుండా సూటిగా, స్పష్టంగా మాట్లాడాలని  తమ వాదనలను బలంగా తక్కువ వ్యవధిలో వినిపించడం ద్వారా సభా  గౌరవం పెరుగుతుందని మంత్రి   వివరించారు

Spotlight

Read More →