AP Fee Reimbursement: యువగళం హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలతో పేద విద్యార్థులకు భరోసా! Chandrababu Naidu: కూటమి ఐక్యతే ఏపీ అభివృద్ధి మంత్రం..! చంద్రబాబు క్లారిటీ! AP Politics: పాత గణాంకాలతో బురదజల్లే ప్రయత్నం..! వైసీపీ ‘పేటీఎం బ్యాచ్‌ల’పై అచ్చెన్నాయుడు ఫైర్! Group1Scam: ఏపీ గ్రూప్-1 అక్రమాలపై సిట్ విచారణకు హైకోర్టు సంచలన తీర్పు! AP Cabinet Meeting Decisions: సౌర విద్యుత్, బయోగ్యాస్ ప్లాంట్లకు భూ కేటాయింపు.. ఆ ప్రాంతంలో 1500 ఎకరాలు కేటాయింపు.!! AP Assembly Budget Session Strategy: కుల, మత చిచ్చు పెట్టాలని వైకాపా ప్లాన్.. ఎన్డీఏ భేటీలో చంద్రబాబు పవన్ కీలక వ్యాఖ్యలు.! AP Assembly Satirical Comments : 11వ తేదీ.. 11 మంది.. 11 నిమిషాలు వైకాపా తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సెటైర్లు! AP Budget 2026 ఎంతసేపు మాట్లాడామన్నది కాదు.. ఏం చెప్పామన్నదే ముఖ్యం.. అసెంబ్లీలో కొత్త సంప్రదాయానికి పయ్యావుల పిలుపు..!! AP Ministers: ఏపీలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల బెదిరింపు లేఖలు! కుటుంబ సభ్యుల్లో ఆందోళన... AP Budget 2026 Date: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ షెడ్యూల్ ఖరారు.. మార్చి 7 వరకు సమావేశాలు 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం..!! AP Fee Reimbursement: యువగళం హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలతో పేద విద్యార్థులకు భరోసా! Chandrababu Naidu: కూటమి ఐక్యతే ఏపీ అభివృద్ధి మంత్రం..! చంద్రబాబు క్లారిటీ! AP Politics: పాత గణాంకాలతో బురదజల్లే ప్రయత్నం..! వైసీపీ ‘పేటీఎం బ్యాచ్‌ల’పై అచ్చెన్నాయుడు ఫైర్! Group1Scam: ఏపీ గ్రూప్-1 అక్రమాలపై సిట్ విచారణకు హైకోర్టు సంచలన తీర్పు! AP Cabinet Meeting Decisions: సౌర విద్యుత్, బయోగ్యాస్ ప్లాంట్లకు భూ కేటాయింపు.. ఆ ప్రాంతంలో 1500 ఎకరాలు కేటాయింపు.!! AP Assembly Budget Session Strategy: కుల, మత చిచ్చు పెట్టాలని వైకాపా ప్లాన్.. ఎన్డీఏ భేటీలో చంద్రబాబు పవన్ కీలక వ్యాఖ్యలు.! AP Assembly Satirical Comments : 11వ తేదీ.. 11 మంది.. 11 నిమిషాలు వైకాపా తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సెటైర్లు! AP Budget 2026 ఎంతసేపు మాట్లాడామన్నది కాదు.. ఏం చెప్పామన్నదే ముఖ్యం.. అసెంబ్లీలో కొత్త సంప్రదాయానికి పయ్యావుల పిలుపు..!! AP Ministers: ఏపీలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల బెదిరింపు లేఖలు! కుటుంబ సభ్యుల్లో ఆందోళన... AP Budget 2026 Date: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ షెడ్యూల్ ఖరారు.. మార్చి 7 వరకు సమావేశాలు 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం..!!

AP Fee Reimbursement: యువగళం హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలతో పేద విద్యార్థులకు భరోసా!

Fee Reimbursement Arrears Release: నారా లోకేష్ చొరవతో రూ. 1,200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదలయ్యాయి. విజయవాడలో శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులు పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు.

Published : 2026-02-11 23:30:00

ఈట్ స్ట్రీట్ లో బాణసంచా హోరు.. విద్యార్థుల జోరు

యువగళం మాట.. నిధుల మూట 

1,200 కోట్ల విడుదల ఆగిపోయిన చదువులకు మళ్లీ ఊపిరి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం దిశగా తీసుకున్న కీలక నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ఆనందోత్సాహంతో నింపుతోంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో పెండింగ్‌లో ఉన్న రూ. 1,200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించినందుకు కృతజ్ఞతగా విజయవాడలోని ఈట్ స్ట్రీట్ వేదికగా భారీ ఎత్తున సంబరాలు మిన్నంటాయి. శాప్ (SAP) చైర్మన్ అనిమిని రవినాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు నారా లోకేష్ (Nara lokesh) చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ విజయవాడ వీధుల్లో పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. గత కొంతకాలంగా ఫీజుల బకాయిలు చెల్లించక విద్యాసంస్థల్లో ఎదురవుతున్న ఇబ్బందులకు ఈ నిర్ణయంతో చెక్ పడిందని, పేద విద్యార్థుల చదువులకు లోకేష్ అండగా నిలిచారని విద్యార్థి సంఘాల నేతలు కొనియాడారు.

కార్యక్రమంలో  శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చెప్పింది చేసి చూపిస్తోందనడానికి ఈ నిధుల విడుదలే నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో యువగళం పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చిన ప్రతి మాటను మంత్రి లోకేష్ అక్షరాలా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారని ఆయన ప్రశంసించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు లోకేష్ గారు బాటలు వేస్తున్నారని రవినాయుడు తెలిపారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ  వ్యవధిలో  ఇన్ని కోట్ల నిధులు విడుదల చేయడం పట్ల యువతలో విశ్వాసం పెరిగిందని నాయకులు పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక సర్టిఫికెట్లు ఆగిపోయిన విద్యార్థులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిస్తుందని, ఇది కేవలం నిధుల విడుదల మాత్రమే కాదని, వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపారని తెలిపారు. రానున్న రోజుల్లో విద్యారంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని, విద్యార్థుల కష్టాలు తెలిసిన నాయకుడిగా లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.

Spotlight

Read More →