praja vedika: ఆస్తి కోసం కన్నతండ్రినే వీధుల పాలు చేసిన కొడుకులు.. జగనన్న రీసర్వేలో రికార్డుల తారుమారు.. గ్రీవెన్స్ లో ఫిర్యాదు!

praja vedika: ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన నాగరాజు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను. తనకి గ్రామంలో సొంత ఇళ్ల స్థలం ఉంది.

జగనన్న రీసర్వేలో రికార్డుల తారుమారు.. గ్రీవెన్స్ లో ఫిర్యాదు!
జగనన్న రీసర్వేలో రికార్డుల తారుమారు.. గ్రీవెన్స్ లో ఫిర్యాదు!
  • Politics: అంబాపురంలో రెవెన్యూ అధికారుల నిర్వాకం.. ప్రైవేట్ ఇళ్ల స్థలాన్ని నిషేధిత జాబితాలో చేర్చిన వైనం..

  • ఏపీ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ ఛైర్మన్ గండి బాబ్జీ, ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్‌ పీతల సుజాత..

praja vedika: ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన నాగరాజు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను. తనకి గ్రామంలో సొంత ఇళ్ల స్థలం ఉంది. అక్కడ ఇల్లు నిర్మించుకోవాలనే ఉద్దేశంతో, గత నెల 20వ తేదీన (20-06-2026) ఉదయం తన బావమరిది చల్లా నర్సింహారావు, చెల్లి లక్ష్మితో కలిసి స్థలంలోని చెత్తాచెదారాన్ని శుభ్రం చేయడానికి వెళ్లాను. ఆ సమయంలో తన సొంత అన్న గుంజి వెంకటేశ్వరరావు, అతని భార్య వెంకటమ్మ, కుమారుడు యశ్వంత్‌లు ఒక్కసారిగా అక్కడికి వచ్చి, "ఈ స్థలం మాది, మీరెలా వస్తారు?" అంటూ బూతులు తిడుతూ గొడవకు దిగారు. 

అంతటితో ఆగకుండా వెంట తెచ్చుకున్న కర్రలు, రోకలిబండ, రాళ్లతో దాడికి తెగబడ్డారు. తన అన్న కొడుకు యశ్వంత్ తనను కర్రతో బలంగా కొట్టి, కడుపులో పొడిచాడు. తనను కాపాడటానికి అడ్డువచ్చిన బావమరిది నర్సింహారావును వెంకటేశ్వరరావు, వెంకటమ్మలు కర్ర, రోకలిబండతో కాలుపై తీవ్రంగా కొట్టారు. చంపేస్తామంటూ బండరాయితో పైకి రావడంతో, గమనించిన స్థానికులు అడ్డుపడి తమని కాపాడారు. జరిగిన గొడవపై గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేయడానికి వెళ్తుండగా... వెంకటేశ్వరరావు రోకలిబండతో తమని వెంటాడాడు. "మళ్లీ ఈ స్థలంలో అడుగుపెడితే మిమ్మల్ని నరికి చంపేస్తాం, ఎవరికి చెప్పుకున్నా మమ్మల్ని ఏమీ చేయలేరు" అంటూ బహిరంగంగా ప్రాణభీతి కలిగించేలా బెదిరింపులకు పాల్పడ్డారు. కావున వారిపై చర్యలు తీసుకొని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు ఏపీ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ ఛైర్మన్ గండి బాబ్జీ, ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్‌ పీతల సుజాతలకు అర్జీ ఇచ్చి అభ్యర్ధించాడు.

ఏలూరు జిల్లా ముదినేపల్లి గ్రామానికి చెందిన కొల్లి స్వరూప రాణి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామ పరిధిలోని రీసర్వే నెంబర్లు 243, 246/5, 248, 248/4 లలో తన భర్త కొల్లి సాంబశివరావు పేరిట, అలాగే రీసర్వే నెంబర్లు 248/1, 248/2 లలో తన పేరిట మొత్తం భూములు ఉన్నాయి. ఇవన్నీ స్వయంగా కొనుగోలు చేసినవి, మరికొన్ని తమ పూర్వీకుల నుండి సంక్రమించిన ఆస్తులు. వీటికి సంబంధించిన రిజిస్టర్డ్ దస్తావీజులు కలిగి ఉండి, క్రమం తప్పకుండా ప్రభుత్వానికి పన్నులు కూడా చెల్లిస్తున్నారు.

అయితే గత జగన్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష రీసర్వేలో రికార్డులను తారుమారు చేశారు. సాంబశివరావు పేరిట ఉన్న 2 ఎకరాల 30 సెంట్ల భూమికి గాను, రీసర్వే అనంతరం కేవలం 2 ఎకరాల 08 సెంట్లు మాత్రమే ఉన్నట్లు లెక్క తేల్చారు. దీనివల్ల తమకు చెందిన 22 సెంట్ల భూమి ఒక్కసారిగా తగ్గిపోయింది. తమ భూమి ఎందుకు తక్కువగా చూపించారని స్థానిక రెవెన్యూ అధికారులను ప్రశ్నించగా, వారి నుండి ఎలాంటి సరైన సమాధానం రాలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన మేకా ఉమామహేశ్వరి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..అంబాపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల రీసర్వే నెంబర్ 72/1 లో తమకు 180 గజాల ఇళ్ల స్థలం ఉంది. ఈ స్థలాన్ని గతంలో (2004 లో) రిజిస్ట్రేషన్ నెంబర్ 5079/2004 ద్వారా చట్టబద్ధంగా కొనుగోలు చేశాను. నాటి నుండి నేటి వరకు ఆ స్థలం తమ ఆధీనంలోనే ఉంది. దీనికి సంబంధించిన అసలు లింక్ దస్తావీజులు, పన్ను రశీదులు, ఇతర రెవెన్యూ రికార్డులన్నీ తన వద్ద భద్రంగా ఉన్నాయి. అయితే, గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ అధికారులు ఎటువంటి విచారణ జరపకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రైవేట్ స్థలాన్ని నిషేధిత భూముల జాబితా అయిన 22/A లో చేర్చారు. అంతేకాకుండా దీనిని అక్రమంగా అసైన్డ్ భూముల జాబితాలో కూడా చేర్చడంతో, ప్రస్తుతం ఈ స్థలంపై తనకు ఎలాంటి హక్కులు లేకుండా పోయాయి. కావున వారిపై చర్యలు తీసుకని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

తిరుపతి జిల్లా చిట్వేలి మండలం గరుగుపల్లి గ్రామానికి చెందిన దుగ్గినేని యానాదయ్య నాయుడు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో సర్వే నంబర్ 1698 లో 3.37 ఎకరాల సొంత భూమి కలదు. ఇది కాకుండా తన ఇద్దరు కుమారులైన దుగ్గినేని పెద్దరెడ్డయ్య నాయుడు, దుగ్గినేని చిన్నరెడ్డయ్య నాయుడుల వద్ద ఇప్పటికే తలో 4.62 ఎకరాల వ్యవసాయ భూమి (మొత్తం 9.24 ఎకరాలు) ఊరిలో 3 ఇళ్లు ఉన్నాయి. వారు అన్ని వసతులతో సుఖంగా ఉన్నప్పటికీ, తండ్రినైన తనను మాత్రం వీధుల పాలు చేశారు. గత 15 సంవత్సరాల క్రితం వృద్ధాప్యంలో కొడుకులు తండ్రిని బాగా చూసుకుంటారనే నమ్మకంతో తనకున్న 3.37 ఎకరాల భూమిని, ఇళ్లను ఒక రూ.10 స్టాంప్ పేపర్ పై రాసి ఇచ్చారు. 

కానీ ఆ కాగితం చేతికి అందిన నాటి నుండి కొడుకులు ఇద్దరూ తండ్రిని ఇంట్లో నుండి గెంటివేసి, కనీసం ఒక పూట అన్నం పెట్టకుండా, ఆసుపత్రి ఖర్చులు కూడా ఇవ్వకుండా తీవ్రంగా హింసిస్తున్నారు. ప్రభుత్వ అధికారిక రికార్డులైన 1-B,అడంగల్ ల్యాండ్ రికార్డులలో సదరు 3.37 ఎకరాల భూమి (సర్వే నెం: 1698) ఇప్పటికీ పూర్తిగా తన పేరు మీదే సక్రమంగా ఉంది. చట్టప్రకారం భూమి తనదే అయినప్పటికీ కొడుకులు ఆనాటి రూ.10 పాత స్టాంప్ పేపర్‌ను అడ్డం పెట్టుకుని, రాజకీయ పలుకుబడితో తనని సొంత పొలంలోకి, ఇంట్లోకి అడుగుపెట్టనివ్వడం లేదు. పైగా ఎదురుతిరిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు. 

అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం జె.వి.పాలెం గ్రామానికి చెందిన వజ్రపు లక్ష్మి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 386/1 లో 2020లో 0.13 సెంట్ల భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేశాం. ఆ స్థలంలో రెండు నెలల క్రితం పశువుల షెడ్డు నిర్మాణాన్ని ప్రారంభించగా, పాత కక్షలను మనసులో ఉంచుకుని గ్రామ మాజీ సర్పంచ్ వజ్రపు శంకరరావు అధికారుల సహాయంతో మొదటి నుండి ఆటంకాలు కలిగిస్తూ వచ్చారు. తప్పుడు ఫిర్యాదులు చేసినప్పటికీ, తాము నిబంధనల ప్రకారమే ఈ నెల 11వ తేదీన షెడ్ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాం. దీనిపై కక్ష పెంచుకున్న మాజీ సర్పంచ్ వజ్రపు శంకరరావు, తన అనుచరులైన కొత్తపల్లి రాము, తుంపాల భవానీ శంకర్‌లతో కలిసి ఈ నెల 14వ తేదీ ఉదయం 11:30 గంటల సమయంలో దౌర్జన్యానికి దిగారు.

తమపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టాలనే కుట్రతో బయటి వ్యక్తులను, మద్యం తాగిన గూండాలను తీసుకొచ్చారు. ఈ దౌర్జన్యానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి గొర్లె వెంకట కృష్ణ, ఎంపీడీఓ పి.ఎస్.వి.ఎల్. మీనా కుమారి, ఏఎస్ఐ ఏ.వెంకటేశ్వరరావు, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు, రెవెన్యూ సిబ్బంది పూర్తి అండదండలు అందించారు. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులే దగ్గరుండి జేసీబీతో పశువుల షెడ్డును పూర్తిగా కూల్చివేసి నేలమట్టం చేశారు. తమ మొబైల్ ఫోన్లను లాక్కొని, బంధించి, తీవ్రంగా బూతులు తిడుతూ దాడులు చేశారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం గుండ్లచెరువు గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ గఫూర్‌ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలోని సర్వే నంబర్ 475/2లో 3.26 ఎకరాల పిత్రార్జిత భూమి ఉంది. ఈ భూమిలో పంటలు పండించుకుంటూ తమ కుటుంబం జీవిస్తోంది. అయితే, గ్రామానికి చెందిన షేక్ షనూర్ భాష, యస్. షబ్బీర్, యస్. ముబారక్ అనే వ్యక్తులు కక్షగట్టి, తమని పొలం దగ్గరకి, బోరుబావి కాడికి పోనివ్వకుండా అడ్డుకుంటున్నారు. 

గతంలో ఈ దారి సమస్యపై స్థానిక తహశీల్దార్ గారికి ఫిర్యాదు చేయగా, అధికారులు స్పందించి సర్వే నంబర్ 504లోని వంక పోరంబోకు గుండా దారిని చూపిస్తూ తనకి అధికారికంగా ఎండార్సుమెంటు  ఇచ్చారు. ఆ దారి గుండా వెళ్తుండగా, సదరు వ్యక్తులు "ఈ వంక పోరంబోకు భూమిని మేము పట్టా చేయించుకున్నాము" అని చెబుతూ దారిని పూర్తిగా మూసివేశారు. ప్రభుత్వ వంక పోరంబోకు భూమికి వారికి ఎలా పట్టా ఇస్తారని, కావాలనే తహశీల్దార్ ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ తనను ఇబ్బంది పెడుతున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

విజయనగరం జిల్లా గరివిడి మండలం అర్ధమూరు గ్రామానికి చెందిన అంకమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో సర్వే నెంబర్లు 294-6 (2.93 ఎకరాలు), 295-1 (0.52 సెంట్లు), అలాగే పట్టా నెంబర్ 50 కింద ఉన్న 1.14 ఎకరాలు, 0.59 సెంట్ల భూమి ఉంది. 1980-1990, 2012-2014 సంవత్సరాల మధ్య  ప్రభుత్వం డి-పట్టా భూములను కేటాయించింది. ఈ భూములను కుటుంబ సభ్యులంతా ఉమ్మడిగా సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం. అయితే, చనిపోయిన పెద్దల పేరున ఉన్న రికార్డులను మారుస్తానని నమ్మబలికిన తమ బంధువు అత్తమూరు సూర్యనారాయణ, దొంగచాటుగా ఆ భూములను తన భార్య అత్తమూరు రాములమ్మ పేరిట పట్టాదారు పాస్ పుస్తకాలుగా మార్పించి తీవ్రంగా మోసం చేశాడు.

వెబ్‌ల్యాండ్ లో కూడా తన భార్య పేరు మీదే రికార్డులు నమోదు చేయించుకున్నాడు. అంతేకాకుండా, 2012-14 మధ్య కాలంలో గ్రామంలోని మరో 3.50 ఎకరాల కొండ పోరంబోకు భూమిని కూడా దౌర్జన్యంగా తన పేరిట డి-పట్టా చేయించుకున్నాడు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం గుండ్లచెరువు గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ గఫూర్‌ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలోని సర్వే నంబర్ 475/2లో 3.26 ఎకరాల పిత్రార్జిత భూమి ఉంది. ఈ భూమిలో పంటలు పండించుకుంటూ తమ కుటుంబం జీవిస్తోంది. అయితే, గ్రామానికి చెందిన షేక్ షనూర్ భాష, యస్. షబ్బీర్, యస్. ముబారక్ అనే వ్యక్తులు కక్షగట్టి, తమని పొలం దగ్గరకి, బోరుబావి కాడికి పోనివ్వకుండా అడ్డుకుంటున్నారు. గతంలో ఈ దారి సమస్యపై స్థానిక తహశీల్దార్ గారికి ఫిర్యాదు చేయగా, అధికారులు స్పందించి సర్వే నంబర్ 504లోని వంక పోరంబోకు గుండా దారిని చూపిస్తూ తనకి అధికారికంగా ఎండార్సుమెంటు  ఇచ్చారు.

ఆ దారి గుండా వెళ్తుండగా, సదరు వ్యక్తులు "ఈ వంక పోరంబోకు భూమిని మేము పట్టా చేయించుకున్నాము" అని చెబుతూ దారిని పూర్తిగా మూసివేశారు. ప్రభుత్వ వంక పోరంబోకు భూమికి వారికి ఎలా పట్టా ఇస్తారని, కావాలనే తహశీల్దార్ ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ తనను ఇబ్బంది పెడుతున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన గద్దె వెంకటకృష్ణారావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..వెంకయ్యపాలెం గ్రామంలో తన కుమారుడి పేరు మీద 3.31 ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి సంబంధించిన మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా, స్థానిక రెవెన్యూ అధికారులు (వి.ఆర్.ఓ, ఎమ్.ఆర్.ఓ) లంచాలకు ఆశపడి, అవినీతికి పాల్పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఆన్‌లైన్ రికార్డులను తారుమారు చేశారు. గతంలో కుటుంబంలో జరిగిన కొన్ని మరణాలు, కోర్టు వివాదాల వల్ల తలెత్తిన పరిస్థితులను ఆసరాగా చేసుకుని అధికారులు ఈ అక్రమాలకు ఒడిగట్టారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ  సమస్యను పరిష్కరించాలని కోరాడు.

ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన రంగారావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తన కుమార్తె, ముసునూరు మండలం చింతలవల్లి గ్రామానికి చెందిన వాసం అవినాష్‌ను ఆరు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. అయితే, పెళ్లయిన కొంతకాలం నుంచే భర్త అవినాష్ ఆమెను అనుమానిస్తూ, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. గత ఏడాది డిసెంబర్ 17 నుండి తన కనిపించకుండా పోయింది. దీనిపై అప్పట్లోనే విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఆ సమయంలో భర్త అవినాష్ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో... కొండూరు శ్యామ్ అనే హిజ్రాతో తనకు పరిచయం ఉందని, బెంగళూరులో 'యాక్టింగ్' పని కోసం పంపితే రూ. 10 వేలు ఇస్తానని సదరు హిజ్రా ఒప్పందం చేసుకున్నాడు.

పని ముగించుకుని వచ్చిన తర్వాత ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో గొడవ జరిగిందని, ఆ తర్వాతే తన భార్య కనిపించకుండా పోయిందని అవినాష్ చెప్పుకొచ్చాడు. కుమార్తె అదృశ్యంపై ఈ ఏడాది మార్చి 25న నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. అయితే, గత ఆరు నెలలుగా పోలీసులు ఫోన్ ట్రాకింగ్ చేస్తున్నామని చెబుతున్నారే తప్ప, ఆచూకీ కనుగొనడంలో ఎలాంటి పురోగతి చూపలేదు. డబ్బుల విషయంలో జరిగిన గొడవ కారణంగా భర్త అవినాష్ లేదా సదరు హిజ్రా శ్యామ్ కలిసి తన కుమార్తెకు ఏదైనా అపాయం తలపెట్టి ఉంటారేమోనని తీవ్ర అనుమానం వ్యక్తం చేశారు. కావున వారిపై చర్యలు తీసుకోని తన కుమార్తె ఆచూకి తెలుపగలరని కోరాడు.

వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.

Tags

Be the first to react

Latest