కూటమి ప్రభుత్వంపై అవాస్తవ ప్రచారానికి జగన్ చేతిలో ఉన్న మానసపత్రిక సాక్షి వేదికగా మారిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి, పారదర్శకత, స్థిరత కోసం కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన మద్దతు ఇచ్చినప్పటికీ, ఆ వాస్తవాన్ని అంగీకరించలేని జగన్ తప్పుడు కథనాలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి విమర్శించారు.
అభివృద్ధి పయనాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం దిశా నిర్ధేశక నిర్ణయాలు తీసుకుంటుండగా, దానికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశ్యంతో కుట్రపూరితమైన కథనాలను ప్రచురించడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు.
సాక్షిలో ప్రచురించిన అన్నదాత దుఃకీభవ కర్షకుడిని మోసం చేసిన బాబు సర్కార్ అను వార్త పూర్తిగా కల్పితమని, కూటమి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలన్న లక్ష్యంతో చేపట్టిన అసత్య ప్రచారంగా మంత్రి అభివర్ణించారు. ప్రజలు ప్రతీ విషయాన్ని గమనిస్తున్నారని, ఇటువంటి అవాస్తవాలకు మళ్లీ నమ్మకం పలుకరించబోరని అచ్చెన్నాయుడు గారు స్పష్టం చేశారు.
రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువతకు అవకాశాల సృష్టి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, దారితప్పించే ప్రయత్నాలు ఏవైనా ప్రజల తీర్పు ముందర నిలబడలేవని మంత్రి హెచ్చరించారు.
అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్‌పై సూపర్ సిక్స్ హామీ అమలు..
సాక్షి యాజమాన్యం ప్రచురించిన వార్త పూర్తి అవాస్తమని తెలుపుతూ ,ప్రస్తుత ప్రభుత్వం రైతన్నలకు చేదోడుగా ఉంటూ మరింత సేవలు అందిస్తు కర్షకుల మన్ననలు పొందుతున్నదని తెలిపారు.
ముందుగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం గురించి తెలియచేస్తూ రైతాంగానికి సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీకి అనుగుణముగా భూ యజమానులు మరియు అటవీ భూమి సాగుదారులకు ఇప్పటివరకు 2025-26 ఆర్థిక సంవత్సరము రెండువిడతలలో (ఖరీఫ్ మరియు రబీ సీజన్ లకు) పీఎం కిసాన్ లబ్దితో కలిపి అర్హత గల ప్రతి రైతుకు రు.14,000/- ఇవ్వడం జరిగిందని,మిగిలిన రు.6000/- మూడవ విడతలో ఇవ్వడం ద్వారా ఏడాదికి 20000/- సాయం అందుతుందని తెలిపారు.
ఈ పధకం కింద 46.86 లక్షల భూయజమానులు మరియు అటవీ భూమి సాగుదారు రైతు కుటుం బాలకు రు.6309.44 కోట్లను అందించింది. (పీఎం కిసాన్ పథకం కింద రు.1623.60 కోట్లతో కలిపి) రాష్ట్రములోని అర్హులైన భూమిలేని సాగుదారులందరికీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు నుండి సంవత్సరానికి రు.20000/- చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నది అని, ఈ పంట ప్రక్రియ పూర్తి అవ్వగానే కౌలు రైతుల అర్హతను ధృవీకరించి రెండువిడతలలో లబ్ధి అందజేయడం జరుగుతుందని తెలిపారు.
ప్రాథమిక వ్యవసాయ రంగంలో దేశంలోనే ఏపీ ముందువరుసలో..
ఈ 17 నెలల కాలంలో సూపర్ సిక్స్ పథకాలను పూర్తిగా నెరవేరుస్తూ ప్రాథమిక వ్యవసాయ రంగంలోని వ్యవసాయము , ఆక్వా కల్చర్ ,ఉద్యాన ,పట్టు శాఖలలో,పశు పోషణ , పాల ఉత్పత్తి , మాంసం ఉత్పత్తిలో ప్రగతి చూపటంలో మన రాష్ట్రం దేశంలోనే ముందువరుసలో ఉన్నామని తెలుపుతూ, ఇవన్నీ చేస్తూనే విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు మద్దతుగా నిలుస్తున్నది కూటమి ప్రభుత్వం అని పేర్కొన్నారు.
ఇన్పుట్ సబ్సిడీ విషయములో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రు.310 కోట్ల మేర అందించడం జరిగింది .మోoత (Montha) తుఫానుకు నష్టబోయిన 3.26 లక్షల మంది రైతులకు రు.390 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించబోతున్నాం అని తెలిపారు.
పంటలభీమా విషయంలో పి యం ఫసల్ బీమా యోజన , వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తూ,మామిడి పంటను కూడా మొదటిసారిగా భీమా పరిధిలోకి తేవటం జరిగిందని తెలిపారు. భీమా పొందడానికి పంటకు జరిగిన నష్టాన్ని అంచనా నమోదు చేయటానికి , దిగుబడుల వివరాలను తెలుసుకునేందుకు శాటిలైట్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల నుంచి రు.15,955/- కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి ,కేవలం 24 నుండి 48 గంటలలోపు చెల్లించామని తెలిపారు . వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ ధరల వ్యత్యాసం ఏర్పడినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా సరైన మద్దతు ఇవ్వడం ,రైతు బజార్లు ,మార్కెట్ సౌకర్యాలను విస్తృత పరచటం చేయడం జరిగిందని తెలిపారు.
నల్ల బర్లీ, ఉల్లి, తోతాపురి మామిడి, కోకో – ప్రత్యక్ష మద్దతు
నల్ల బర్లీ పొగాకు మార్కెట్ ధరల విషయములో సమస్యలు ఏర్పడినప్పుడు ,రాష్ట్ర ప్రభుత్వం ₹273 కోట్ల నిధులను కేటాయించి 12 వేల మంది రైతుల నుండి 19.77 మిలియన్ కిలోల నల్ల బర్లీ పొగాకును కొనుగోలు చేయటం జరిగిందని, అదేవిధముగా ఉల్లి ధరల విషయంలో 30 వేల రైతులకు హెక్టారుకు ₹50000/- చొప్పున చెల్లించామని, తోతాపురి మామిడి విషయములో 5 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని కంపెనీల ద్వారా కొనుగోలు చేయించి కిలోకు ₹4 చొప్పున 51 వేల మంది రైతులకు ₹173 కోట్లు ప్రయోజనం చేకూర్చటం జరిగింది.
కోకో రైతులకు కిలోకు అదనంగా ₹50/- చెల్లించి ,2358 మెట్రిక్ టన్నుల కోకో బీన్స్ కంపెనీల ద్వారా కొనుగోలు చేసి 4 వేల మంది రైతులకు 12 కోట్లు మేలు చేయటం జరిగిందని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం సాగులో దేశంలోనే మన రాష్ట్రంను ముందు వరసలో ఉంచి ,ఆదర్శంగా నిలిచాం.
వ్యవసాయ యాంత్రీకరణ విషయంలో గత ప్రభుత్వము పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తే ప్రస్తుత ప్రభుత్వము 2025-26 సంవత్సరములో ₹164.158 కోట్ల రాయితీతో పనిముట్ల పంపిణీ ,₹80 కోట్ల రాయితీ నిధులతో 80% రాయితీపై 1000 కిసాన్ డ్రోన్ లను ఇవ్వబోతున్నాం.
గత ప్రభుత్వం పక్కన పెట్టిన భూసార పరీక్షలు మళ్ళీ మొదలు పెట్టి ,6 లక్షలకు పైగా భూసార పరీక్షలు నిర్వహించి 3.5 లక్షల మందికి సాయిల్ హెల్త్ కార్డులు జారీ చేయడం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాకూడా పథకాలను అందించడంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆచరణలో చూపుతూ రైతు సంక్షేమంపై మా చిత్తశుద్ధిని నిరూపించడం జరిగింది.
రైతులు వారి వ్యవసాయం లాభసాటిగా మారేలా ,రైతులను ఆర్థిక భరోసా పెంచేలా పంచ సూత్రాల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించాం. సాగునీటి భద్రత కల్పించటం ,డిమాండ్ ఆధారిత పంటల సాగు, సాగుకు సాంకేతికను జోడించే అగ్రిటెక్ విధానం , ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా ఆహార శుద్ధి మరియు పంటల ధర విషయంలో మద్దతు ఇవ్వడం ద్వారా రైతులను బలోపేతం చేయబోతున్నాం.
రైతుల విషయంలో తక్కువ కాలములోనే వివిధ రైతాంగ సమస్యలు అధిగమించి, రైతులకు నిరంతరం సేవలు అందిస్తూ వారిని వికాసం వైపు తీసుకువెళ్తున్నాం అని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు.