సామాన్య ప్రజలే టార్గెట్ గా కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లపై ఏపీ సిఐడి ఫోకస్ పెట్టింది. ఇటీవల టీవీ5 CEO మూర్తి మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లోని వీడియో ను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మార్ఫ్ చేసి కేవలం 22 వేల రూపాయలు చెల్లిస్తే వారం వారం లక్షల్లో ఆదాయం పొందొచ్చు అని ముఖ్యమంత్రి గారు అన్నట్లుగా ఒక వీడియోను సైబర్ నేరగాళ్లు సామజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేస్తున్న విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ వెంటనే స్పందించి ఇలాంటి ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.
ఈ వ్యవహారం పై తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదుతో CID కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది.