AP Government: విద్యా శాఖ సీరియస్ వార్నింగ్.... ఇకపై అలా చేస్తే క్రిమినల్ కేసులు! Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Nara Lokesh: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల: రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణతతో అభ్యర్థుల హవా! AP Government: విద్యా శాఖ సీరియస్ వార్నింగ్.... ఇకపై అలా చేస్తే క్రిమినల్ కేసులు! Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Nara Lokesh: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల: రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణతతో అభ్యర్థుల హవా!

ED: పటాన్‌చెరులో ఈడీ బాంబు! ఎమ్మెల్యే సోదరుడి ₹80 కోట్ల ఆస్తులకు సీజ్..!

 పటాన్‌చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డికి చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేయడం తెలంగాణ రాజకీయ వర్గాల

Published : 2025-11-24 19:51:00
నేను, బ్రహ్మణి అమెరికాలో అన్నీ పంచుకున్నాం.. మంత్రి లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఇంట్లో లోకేశ్ ఏం చేస్తారంటే?

పటాన్‌చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డికి చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేయడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. సుమారు ₹80 కోట్ల విలువైన ఆస్తులు మధుసూదన్ రెడ్డి బెనామీ పేర్లపై కొనుగోలు చేశారనే అనుమానాల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఆయన నిర్వహిస్తున్న సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీలు భారీ స్థాయిలో అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు ఈడీ దర్యాప్తులో బయటపడింది. ఈ కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని కూడా ఉద్దేశపూర్వకంగా మినహాయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Smart Card: ఏపీలో సేవలన్నీ ఒకే స్కాన్‌లో! స్మార్ట్ ఫ్యామిలీ కార్డు తో పౌరులకు భారీ సౌకర్యాలు!

ఈడీ దర్యాప్తు ప్రకారం, శాండ్ అండ్ గ్రానైట్ సంస్థలు రూ.300 కోట్లకు పైగా విలువైన అక్రమ తవ్వకాలు చేసినట్లు ఆధారాలు లభించాయి. అక్రమంగా తవ్విన ఇసుక, గ్రానైట్‌ను నల్లదందా మార్గంలో విక్రయించి అధిక లాభాలు పొందినట్లు అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈ సంస్థలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.39 కోట్ల రాయల్టీ బకాయిలను కూడా చెల్లించకుండా అక్రమ కార్యకలాపాలు కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పటాన్‌చెరు పోలీసుల ఫిర్యాదు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కోణంలో కేసును నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది.

Tomato prices: టమాటా రేటు కొండెక్కింది.. ఈరోజుల్లో బంగారం కాదు… టమాటానే లగ్జరీ!

దర్యాప్తులో భాగంగా గత సంవత్సరం ఈడీ అధికారులు పటాన్‌చెరులోని గూడెం మహిపాల్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలుపై ఒకేసారి సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో పలు కీలక పత్రాలు, ఆస్తి రికార్డులు, బ్యాంకు వివరాలు, లావాదేవీల డేటాను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా, అనేక ఆస్తులు ఇతర వ్యక్తుల పేర్లలో నమోదు చేయబడ్డప్పటికీ, వాటి వెనుక అసలు యజమాని మధుసూదన్ రెడ్డి అని ఈడీ స్పష్టమైన ఆధారాలను గుర్తించింది. బెనామీ లావాదేవీలను బయటపెట్టిన ఈ పత్రాలు ఈడీ చర్యలకు ప్రధాన కారణమయ్యాయి.

IRCTC Tour Package: తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల కోసం సింగపూర్ స్పెషల్ టూర్ ప్యాకేజీ! పూర్తి వివరాలు!

సమగ్ర దర్యాప్తు అనంతరం, ఈడీ తాజాగా మధుసూదన్ రెడ్డి పేరుతో మరియు ఆయన నియంత్రణలో ఉన్న కంపెనీలు/వ్యక్తుల పేర్లతో ఉన్న ఆస్తులను అటాచ్ చేసింది. ఈ ఆస్తుల మొత్తం విలువ దాదాపు ₹80 కోట్లు అని అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా అక్రమ మైనింగ్, మనీలాండరింగ్‌పై ఈడీ కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, తెలంగాణలో ఇది మరో ప్రముఖ కేసుగా మారింది. ఈ అటాచ్‌మెంట్‌తో కేసు తదుపరి దశలో మరిన్ని అరెస్టులు, అదనపు ఆస్తుల స్వాధీనాలు కూడా జరిగే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఈ పరిణామం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.

Pawan Kalyan: మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్! రూ.8.7 కోట్ల నిధులు విడుదల!
శత్రు జలాంతర్గాములకు చెక్! ఐఎన్ఎస్ మాహెతో సముద్రంలో భారత్ ఆధిపత్యం!
Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి జరగకపోవటంపై సంచలన ట్విస్ట్.. ఫోటోలు డిలీట్… పెళ్లి స్టాప్!
Eyebomma Ravi: ఐదో రోజు పోలీస్ కస్టడీలో ఐబొమ్మ రవి.. డిజిటల్ ఫోరెన్సిక్ డేటాతో ముందుకు!
Bollywood news: బాలీవుడ్‌లో విషాదం.. 'హీ మ్యాన్' ధర్మేంద్ర కన్నుమూత.. 89 ఏళ్ల వయసులో తుదిశ్వాస!
EWS కోటాలో క్లారిటీ లేదు! అర్హతలపై కేంద్రాన్ని కఠినంగా ప్రశ్నించిన హైకోర్టు!

Spotlight

Read More →