AP Government: విద్యా శాఖ సీరియస్ వార్నింగ్.... ఇకపై అలా చేస్తే క్రిమినల్ కేసులు! Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Nara Lokesh: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల: రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణతతో అభ్యర్థుల హవా! AP Government: విద్యా శాఖ సీరియస్ వార్నింగ్.... ఇకపై అలా చేస్తే క్రిమినల్ కేసులు! Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Nara Lokesh: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల: రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణతతో అభ్యర్థుల హవా!

నేను, బ్రహ్మణి అమెరికాలో అన్నీ పంచుకున్నాం.. మంత్రి లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఇంట్లో లోకేశ్ ఏం చేస్తారంటే?

"నేను, నా భార్య బ్రహ్మణి అమెరికాలో ఉన్నప్పుడు ఇంటి పనులను సమానంగా పంచుకునేవాళ్లం. అటువంటి మార్పు ఈ సమాజంలో ప్రతి ఇంట్లోనూ రావాలని నేను బలంగా కోరుకుంటున్నాను" అన

Published : 2025-11-24 19:09:00

"నేను, నా భార్య బ్రహ్మణి అమెరికాలో ఉన్నప్పుడు ఇంటి పనులను సమానంగా పంచుకునేవాళ్లం. అటువంటి మార్పు ఈ సమాజంలో ప్రతి ఇంట్లోనూ రావాలని నేను బలంగా కోరుకుంటున్నాను" అని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. 

సమాజంలో స్త్రీ, పురుష సమానత్వంపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన 'నైతిక విలువల'పై రాష్ట్రస్థాయి విద్యా సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, మహిళల పట్ల గౌరవం ఇంటి నుంచే ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. "చిన్నప్పుడు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరినీ గౌరవించాలని మా అమ్మ భువనమ్మ నాకు నేర్పించారు. కానీ మన సమాజంలో 'గాజులు తొడుక్కున్నావా?', 'చీర కట్టుకున్నావా?' అంటూ మహిళలను కించపరిచే ధోరణి ఇంకా కొనసాగుతోంది. 

దీనికి పూర్తిగా ఫుల్‌స్టాప్ పెట్టాలి" అని పిలుపునిచ్చారు. సినిమాలు, వెబ్ సిరీస్‌లలో కూడా మహిళలను అగౌరవపరిచే సంభాషణలు, సన్నివేశాలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిలతో చర్చించినట్లు ఆయన తెలిపారు.

విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పాఠ్యపుస్తకాలను పరిశీలించగా, ఇంటి పనులు చేస్తున్న ఫోటోలన్నీ మహిళలవే కనిపించాయని లోకేశ్ గుర్తుచేశారు. "ఆ చిత్రాలను వెంటనే మార్పించాం. ఇంటి పనుల్లో పురుషులు కూడా పాలుపంచుకుంటున్నట్టుగా 50-50 నిష్పత్తిలో కొత్త ఫోటోలను చేర్చాం. ఈ మార్పు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, ప్రతి ఒక్కరి ఆలోచనల్లోనూ రావాలి" అని ఆయన ఆకాంక్షించారు.

తన రాజకీయ ప్రస్థానాన్ని వివరిస్తూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. "2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయినప్పుడు ఒక్కరోజే బాధపడ్డాను. కానీ ఆ ఓటమి నాలో కసిని పెంచింది. ఐదేళ్ల పాటు ప్రజల మధ్య ఉండి, వారి మనసు గెలుచుకోవాలని కష్టపడ్డాను. 

ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా వెనకడుగు వేయలేదు. దాని ఫలితమే 2024 ఎన్నికల్లో 91 వేల ఓట్ల భారీ మెజారిటీ. జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడాలి. మార్కులు తగ్గినా, తల్లిదండ్రులు మందలించినా ఆత్మహత్యల వంటి పిరికి చర్యలకు పాల్పడవద్దు" అని విద్యార్థులకు హితవు పలికారు.

Spotlight

Read More →