Nara Lokesh: శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ గారూ.! తిరుమల విషయంలో తప్పుడు ప్రచారాలపై లోకేష్ ఆగ్రహం.. Chandrababu: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రుల భేటీ.. పవన్ ఆరోగ్యంతో పాటు రాష్ట్ర పరిస్థితులపై చంద్రబాబు చర్చ.! Prajavedhika: గతం తవ్విన గొయ్యి.. రీ-సర్వే తప్పుల తడకతో వీధిన పడ్డ అన్నమయ్య జిల్లా రైతులు! భూ దోపిడీపై బాధితుల పోరాటం.. Green Field Corridor: కర్నూలు-సోలాపూర్ హైవే... రాయలసీమ తలరాత మార్చనున్న గ్రీన్‌ఫీల్డ్ కారిడార్! WhatsApp services: వైద్య సేవలు ఇక అరచేతిలోనే.. ఏపీ ప్రభుత్వం నుంచి 'మనమిత్ర' వాట్సాప్ సేవలు ప్రారంభం.! Liquor Price Hike: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు! ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై.. Chandrababu: పవన్‌ను పరామర్శించనున్న చంద్రబాబు.. నేడు హైదరాబాద్‌కు పయనం! Praja Vedika: నేడు (02/05) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP EV Policy: విశాఖ టు తిరుపతి.. ఐదు నగరాలకు మహర్దశ! రూ. 250 కోట్ల నిధితో మోడల్ ఈ-మొబిలిటీకి లైన్ క్లియర్... Amaravati Works: అమరావతిలో కీలక ఘట్టం... ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభానికి సర్వం సిద్ధం! Nara Lokesh: శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ గారూ.! తిరుమల విషయంలో తప్పుడు ప్రచారాలపై లోకేష్ ఆగ్రహం.. Chandrababu: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రుల భేటీ.. పవన్ ఆరోగ్యంతో పాటు రాష్ట్ర పరిస్థితులపై చంద్రబాబు చర్చ.! Prajavedhika: గతం తవ్విన గొయ్యి.. రీ-సర్వే తప్పుల తడకతో వీధిన పడ్డ అన్నమయ్య జిల్లా రైతులు! భూ దోపిడీపై బాధితుల పోరాటం.. Green Field Corridor: కర్నూలు-సోలాపూర్ హైవే... రాయలసీమ తలరాత మార్చనున్న గ్రీన్‌ఫీల్డ్ కారిడార్! WhatsApp services: వైద్య సేవలు ఇక అరచేతిలోనే.. ఏపీ ప్రభుత్వం నుంచి 'మనమిత్ర' వాట్సాప్ సేవలు ప్రారంభం.! Liquor Price Hike: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు! ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై.. Chandrababu: పవన్‌ను పరామర్శించనున్న చంద్రబాబు.. నేడు హైదరాబాద్‌కు పయనం! Praja Vedika: నేడు (02/05) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP EV Policy: విశాఖ టు తిరుపతి.. ఐదు నగరాలకు మహర్దశ! రూ. 250 కోట్ల నిధితో మోడల్ ఈ-మొబిలిటీకి లైన్ క్లియర్... Amaravati Works: అమరావతిలో కీలక ఘట్టం... ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభానికి సర్వం సిద్ధం!

Nara Lokesh: శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ గారూ.! తిరుమల విషయంలో తప్పుడు ప్రచారాలపై లోకేష్ ఆగ్రహం..

Nara Lokesh: "కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తో పెట్టుకోవద్దు జగన్ మోహన్ రెడ్డి గారు!" అంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి దర్శన ఏర్పాట్ల విషయంలో సాక్షి మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

Published : 2026-05-02 21:17:00
  • Politics: తిరుమల ఏర్పాట్లపై సాక్షి ఛానల్ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపణ..
     
  • భక్తులతో బలవంతంగా నెగటివ్ ఫీడ్‌బ్యాక్ చెప్పించే ప్రయత్నం చేశారని విమర్శ..

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, తిరుమల శ్రీవారి విషయంలో రాజకీయాలు చేయవద్దని హెచ్చరించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దని, వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా ఘాటుగా స్పందించారు. తిరుమలలో భక్తులకు కల్పిస్తున్న దర్శన ఏర్పాట్లపై సాక్షి మీడియా కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ, ఇందుకు సంబంధించిన ఒక వీడియోను ఆయన నెటిజన్లతో పంచుకున్నారు. ఈ పరిణామం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

లోకేష్ పంచుకున్న వీడియోలో, తిరుమలలోని సౌకర్యాల పట్ల భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, సాక్షి ఛానల్ ప్రతినిధి మాత్రం భక్తుల నుండి బలవంతంగా ప్రతికూల అభిప్రాయాలను రాబట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని లోకేష్ విమర్శించారు. ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా సాక్షి మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు, భక్తులు తాము క్షేమంగా ఉన్నామని సమాధానమివ్వడంతో సదరు ప్రతినిధి భంగపడ్డారని ఆయన ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో భక్తులు సంతోషంగా ఉన్నప్పటికీ, అసత్యాలను ప్రసారం చేయడం జగన్ నైజమని ఆయన మండిపడ్డారు.

పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రం విషయంలో ఇటువంటి కుట్రపూరిత చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని జగన్‌ను లోకేష్ హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం దైవ కార్యాలను, భక్తుల మనోభావాలను దెబ్బతీయడం సరికాదని ఆయన హితవు పలికారు. ప్రస్తుతం లోకేష్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో, నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి తిరుమల విషయంలో సాగుతున్న ఈ ప్రచార యుద్ధంపై ప్రతిపక్షం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Spotlight

Read More →