LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Opinion

108 Ambulance Services: తిరుపతి ఆటోనగర్‌లో పెను ప్రమాదం ‘గోల్డెన్ అవర్’లో ప్రాణాలు నిలిపిన 108 సిబ్బంది..!

Tirupati Road Accident: తిరుపతి ఆటోనగర్ వద్ద లారీ, వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన 8 మంది గాయపడ్డారు. 108 అంబులెన్స్ సిబ్బంది గోల్డెన్ అవర్‌లో స్పందించి, ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం బాధితులు తిరుపతి సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్…

AndhraPravasi News Desk 1 min read
108 Ambulance Services: తిరుపతి ఆటోనగర్‌లో పెను ప్రమాదం ‘గోల్డెన్ అవర్’లో ప్రాణాలు నిలిపిన 108 సిబ్బంది..!

Tirupati Autonagar Accident News: ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని ఆటోనగర్ సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ  వ్యాన్ బలంగా ఢీకొనడంతో జరిగిన ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే ప్రాణనష్టం జరుగుతుందేమోనన్న భయాందోళనలు వ్యక్తమైనప్పటికీ, అత్యవసర వైద్య సేవలు సకాలంలో అందడంతో పెను ముప్పు తప్పింది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, సమాచారం అందిన కొద్ది నిమిషాల్లోనే 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వైద్య పరిభాషలో ‘గోల్డెన్ అవర్’ (ప్రమాదం జరిగిన మొదటి గంట) అత్యంత కీలకమైంది. సరిగ్గా ఆ సమయంలోనే సిబ్బంది స్పందించి, రక్తపు మడుగులో ఉన్న బాధితులకు అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స అందించారు. వారి చొరవతో బాధితుల పరిస్థితి విషమించకుండా అదుపులోకి  వచ్చిందని బాధితుల కుటుంబాలు సభ్యులు  తెలిపారు.

ఈ ప్రమాదంలో గాయపడిన వారందరూ నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా పని నిమిత్తం తిరుపతికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో కొందరికి ఎముకలు విరగగా, మరికొందరికి తలకు గాయాలయ్యాయి. బాధితుల కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు.

క్షతగాత్రులను 108 వాహనాల్లో అత్యంత జాగ్రత్తగా తిరుపతిలోని ప్రసిద్ధ సిమ్స్  ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వారికి అత్యవసర విభాగంలో చేర్చుకుని తక్షణ చికిత్స ప్రారంభించారు. అంబులెన్స్ సిబ్బంది సకాలంలో తీసుకురావడం వల్లే తాము మెరుగైన వైద్యం అందించగలిగామని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎనిమిది మంది బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఈ క్లిష్ట సమయంలో 108 సిబ్బంది ప్రదర్శించిన సమయస్ఫూర్తిపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో క్షణం ఆలస్యమైనా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని, కానీ ఇక్కడ సిబ్బంది అంకితభావంతో పనిచేసి ఎనిమిది కుటుంబాల్లో వెలుగులు నింపారని స్థానికులు కొనియాడారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

Be the first to react

More Coverage

iPhone: ప్రియురాలి ప్రేమ కోసం పెద్ద స్కెచ్.. నాగ్‌పూర్ ఐఫోన్ దొంగతనం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!

iPhone: ప్రియురాలి ప్రేమ కోసం పెద్ద స్కెచ్.. నాగ్‌పూర్ ఐఫోన్ దొంగతనం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!

iPhone: తన ప్రియురాలికి ఖరీదైన ఐఫోన్‌ను కానుకగా ఇచ్చేందుకు ఓ మైనర్ బాలుడు ఏకంగా రూ.11.39 లక్షల విలువ…

World Records: గాత్రమే ఆయుధం... 12 గంటల్లో 120 పాటలు.. ఆరు అంతర్జాతీయ రికార్డులతో వరంగల్ కుర్రాడి రికార్డు వేట..!

World Records: గాత్రమే ఆయుధం... 12 గంటల్లో 120 పాటలు.. ఆరు అంతర్జాతీయ రికార్డులతో వరంగల్ కుర్రాడి రికార్డు వేట..!

World Records: వరంగల్‌కు చెందిన యువ గాయకుడు చోటు (శివకుమార్) సాధించిన ఆరు ప్రపంచ రికార్డుల గురించిన…