చిన్నారుల సందేశాలు ప్రత్యేక ఆకర్షణ..
“జై తెలుగుదేశం” నినాదాలతో ర్యాలీగా సభ..
సౌదీ అరేబియా తూర్పు ప్రాంతం దమ్మమ్‌లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “మినీ మహానాడు” కార్యక్రమం ఘన విజయాన్ని సాధించింది. ప్రపంచంలోనే తొలిసారిగా విదేశీ గడ్డపై నిర్వహించిన ఈ కార్యక్రమం తెలుగు తమ్ముళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సభా ప్రాంగణం మొత్తం పసుపు రంగుతో అలంకరించబడటంతో కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ మహానాడును కోనేరు ఉమామహేశ్వరరావు, వరప్రసాద్ కందిబెడల, నాగశేఖర్ చందగాని, నాగేశ్వరరావు బలుసు, ప్రభాకర రెడ్డి, దిలీప్, కేవీఎన్ రాజు, శ్రీనివాస్ గుబ్బల, మనోహర్ ప్రసాద్, నిస్సార్ అహ్మద్, శివ సిరిగిన, రాజేంద్ర రెడ్డి, సురేష్ రెడ్డి, రోహిత్ నందా, కిషోర్ NVB, ప్రవీణ్ కోలేటి, రాజ్యలక్ష్మి నందమూరి, శారద కోనేరు, వర్దిని బులుసు, అనిత నాగశేఖర్, సత్య మల్లిన తదితరులు విజయవంతంగా నిర్వహించారు.
“మా తెలుగు తల్లి” గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. చిన్నారుల నృత్యాలు, దేశభక్తి గీతాలు, ప్రసంగాలు సభికులను ఆకట్టుకున్నాయి. రాజకీయ కార్యక్రమాలకు నాగశేఖర్, సత్య మల్లిన వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో చిన్నారులే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. “జై తెలుగుదేశం” నినాదాలతో ర్యాలీగా సభలోకి వచ్చిన పిల్లలు అందరినీ అలరించారు. వారి నృత్యాలు, చక్కటి ప్రసంగాలు సభలో ఉత్సాహాన్ని నింపాయి. యువతకు కూడా వేదికపై మాట్లాడే అవకాశం కల్పించడం ప్రత్యేకతగా నిలిచింది.
జూమ్ కాల్ ద్వారా పాల్గొన్న టీడీపీ మీడియా అధికార ప్రతినిధి వంశీకృష్ణ బండారు, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చరిత్రను, పార్టీ అధికారంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి టీడీపీ మరింత కాలం అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
టీడీపీ సీనియర్ నేతలు టీడీ జనార్ధన్, నందమూరి రామకృష్ణ మహానాడు ప్రాముఖ్యతను వివరించారు. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను ప్రస్తావించారు. సౌదీ అరేబియాలోని తెలుగు ప్రజలతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
వరప్రసాద్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలతో రూపొందిన P4 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తిరుపతిస్వామి స్వర్ణ ఆధ్వర్యంలో గ్రామస్థుల సహకారంతో రూ.30 లక్షల వ్యయంతో “హైందవ స్వర్గధామం” నిర్మాణం చేపట్టిన విషయాన్ని వివరించారు. సేవా కార్యక్రమాలకు గాను కలెక్టర్ చేత సత్కారం, జాయింట్ కలెక్టర్ చేత P4 ప్రశంసాపత్రం అందుకోవడం గర్వకారణమన్నారు.
స్వామి మాట్లాడుతూ సౌదీ అరేబియా నుంచి మొట్టమొదటిసారిగా P4 ప్రశంసాపత్రం అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
జుబైల్ ఇండస్ట్రియల్ సిటీ నుంచి 100 మందికి పైగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతి శుక్రవారం ప్రవాసాంధ్ర భీమా నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ వల్ల ప్రవాసాంధ్రులకు సర్టిఫికెట్లు పొందడంలో ఇబ్బందులు తగ్గాయని, ఈ వ్యవస్థను తీసుకొచ్చిన నారా లోకేష్‌ను ప్రశంసించారు.
టీడీపీ సీనియర్ నాయకుడు కోనేరు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం పుట్టిన పార్టీ అని అన్నారు. తెలుగు వారు ఎక్కడ ఉన్నా అక్కడ టీడీపీ జెండా ఎగురుతుందని చెప్పారు. APNRTS సేవలు, P4 కార్యక్రమం, ప్రవాసాంధ్ర భీమాపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ సౌదీ అరేబియా సభ్యులు తిరుపతిస్వామి స్వర్ణ, ఖాదర్ షేక్, రవి మేడూరి, హరీష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఊహించిన దానికంటే ఘన విజయాన్ని సాధించిందని వారు తెలిపారు.
చిన్నారులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ వారికి వేదికపై మాట్లాడే అవకాశం కల్పించడం ద్వారా భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే దిశగా సౌదీ తూర్పు ప్రాంతం ముందడుగు వేసిందని నిర్వాహకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించే నాయకులు ఇక్కడి నుంచే వస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.