దేశంలో డిజిటల్ లావాదేవీలకు కీలకమైన యూపీఐ (Unified Payments Interface) ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా సేవలందించనుంది. ప్రముఖ గ్లోబల్ పేమెంట్ సంస్థ పేపాల్ తాజాగా ‘పేపాల్ వరల్డ్’ అనే కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఇది యూపీఐతో సహా పలు చెల్లింపు వ్యవస్థల అనుసంధానాన్ని కలిగి ఉంటుంది.
ఇదివరకు భారత్‌లో మాత్రమే యూపీఐ చెల్లింపులు సాధ్యపడేవి. ఇకపై భారతీయ వినియోగదారులు విదేశీ ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో కూడా యూపీఐ ద్వారా చెల్లింపులు చేయగలిగే అవకాశం లభిస్తుంది. ఉదాహరణకు, అమెరికాలోని ఓ ఆన్‌లైన్ స్టోర్‌లో షాపింగ్ చేసిన వినియోగదారుడు చెక్అవుట్ సమయంలో పేపాల్ ఆప్షన్ ఎంచుకుంటే UPI బటన్ కనిపిస్తుంది. అందులోతే నేరుగా యూపీఐ అకౌంటుతోనే పేమెంట్ పూర్తిచేయొచ్చు.
ఈ సౌలభ్యం పేపాల్ – వెన్మో మధ్య ఇంటర్ ఆపరేబిలిటీకి మార్గం వేస్తుంది. దీంతో యూపీఐ సేవల విస్తరణకు ఇది కీలక ముందడుగని ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ సీఈవో రితేశ్ శుక్లా అభిప్రాయపడ్డారు.