రష్మికా మందన్న తాజాగా విడుదలైన ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రంతో మరోమారు ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుండగా, ఆమె వ్యక్తిగత జీవితంపై కొనసాగుతున్న చర్చలు కొత్త మలుపు తీసుకున్నాయి. విజయం వేడుకల నడుమ, ఆమె గతంలో ఎదుర్కొన్న ఒక హృదయభంగం గురించి వెల్లడించడం సోషల్ మీడియాలో చర్చగా మారింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండతో పెళ్లి వార్తలు గాలిలో తేలుతున్న సమయంలో రావడంతో, అభిమానులు ఈ వ్యాఖ్యలను అతనికే అనుసంధానం చేస్తూ విస్తృతంగా పంచుకుంటున్నారు.
తాజా ఇంటర్వ్యూలో రష్మికా, గతంలో తాను ఒక సంబంధంలో పూర్తిగా చిక్కుకుని, “ఎంపిక లేకుండా” ఉన్న రోజుల్ని గుర్తుచేసుకుంది. అటువంటి భావోద్వేగ భారాన్ని ప్రస్తుతం ఉన్న భాగస్వామి ఎంతో కొంత తగ్గించాడని ఆమె స్పష్టంగా పేర్కొంది. పేరును నేరుగా చెప్పకపోయినా, ఇటీవల విజయ్ ఆమెకు ఇచ్చిన బహిరంగ మద్దతు కారణంగా ఇంటర్నెట్ అంతా ఈ ఇద్దరినీ మళ్లీ చర్చలోకి తెచ్చింది. రష్మికా మాట్లాడుతూ, “ఈరోజు నేను ఎవర్ని ఎంచుకోవాలో తెలిసే స్థితికి వచ్చాను. నేను సంతోషంగా ఉండాలి, నా పక్కనున్న వ్యక్తి కూడా సంతోషంగా ఉండాలి. అదృష్టవశాత్తూ నన్ను అర్థం చేసుకునే భాగస్వామి ఉన్నాడు” అని పేర్కొంది.
సుమాతో జరిగిన సంభాషణలో రష్మికా, తన సినిమాలోని భూమ పాత్రలా నిజ జీవితంలోనూ తాను ఒక దశలో మానసిక ఒత్తిడిని అనుభవించానని తెలిపింది. ప్రస్తుతం ఉన్న వ్యక్తి తనకు ఆ బాధ నుంచి బయటపడే ధైర్యం ఇచ్చాడని రష్మికా హృదయపూర్వకంగా చెప్పింది. ఆమె ప్రతి మాటలో ఆ వ్యక్తిపై ఉన్న నమ్మకం, కృతజ్ఞత స్పష్టంగా కనిపించింది.
ఆన్లైన్లో వచ్చే కామెంట్ స్ గురించి మాట్లాడుతూనే రష్మికా తన భాగస్వామి ఎల్లప్పుడూ తనకు ధైర్యం చెప్పడమే కాకుండా ట్రోల్స్‌ను పట్టించుకోకు అని చెప్పేవాడని వెల్లడించింది. నాకు ట్రోలింగ్ తెలిసిపోతుంది. ఇంట్లో చెప్పినాషఅలా ఏమీ లేదు, నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు’ అని అని చెప్పుకొచ్చే. కానీ నేను మాత్రం ప్రతి ట్యాగ్ కూడా చూస్తాను” అని ఆమె నవ్వుతూ చెప్పింది.
ఇదిలా ఉండగా, ఇటీవల ది గర్ల్‌ఫ్రెండ్ సక్సెస్ మీట్లో విజయ్ దేవరకొండ హాజరవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. రష్మికా చేతిని పట్టుకుని ప్రేమగా ముద్దు పెట్టిన క్షణం వీడియోగా వైరలవడంతో ఇది వారి తొలి బహిరంగ ప్రేమ హావాభావంగా నిలిచింది. ఆ క్షణంలో రష్మికా సిగ్గుతో నవ్వుతుండగా విజయ్ ఆమెను చూసిన తీరు అభిమానుల హృదయాలను గెలుచుకుంది.
ఇక వారి వ్యక్తిగత జీవితంపై వస్తున్న కథనాల్లో, అక్టోబర్ 3, 2025న రష్మికా–విజయ్ కుటుంబ సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారని సమాచారం. 2026 ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ జరుగుతోందని కూడా పలువురు మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
అయితే ఈ జంట ఇప్పటివరకు ఈ వార్తలను నేరుగా ధృవీకరించలేదు. కానీ వారి ప్రేమను బహిరంగంగా చూపించిన కొన్ని క్షణాలు అభిమానుల్లో ఆనందాన్ని రేకెత్తిస్తున్నాయి. సినిమాల్లో పోషించే పాత్రలంతగానే, నిజ జీవితంలోనూ రష్మికా, విజయ్ కథ అభిమానులకు ఒక మృదువైన ప్రేమకథలా అనిపిస్తోంది.