Mercedes Benz: భారత్‌లో మెర్సిడెస్-బెంజ్ కార్ల ధరల పెంపు..! ఏ మోడల్‌పై ఎంతంటే? Drug Racket: కొండపల్లిలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు..! రూ. 47 కోట్ల విలువైన అల్రాజోలం స్వాధీనం! Digi Locker: ఆధార్, పాన్ కార్డులు ఇక అవసరం లేదు! CKYC నెంబర్ ఉంటే చాలు! Gold Rates: పసిడి ప్రేమికులకు శుభవార్త... నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు! LPG Cylinder: అమెరికా-ఇరాన్ యుద్ధ సెగలు..! 14 కేజీల గ్యాస్ ధర వింటే దిమ్మతిరగాల్సిందే! Aadhaar Update: ఆధార్ అప్‌డేట్ గడువు ముగుస్తోంది.. వివరాలు మార్చుకోకుంటే చిక్కులే! Oil Crisis: చమురు సంక్షోభంపై ట్రంప్ సంచలన నిర్ణయం! ప్రపంచ దేశాలకు ఊరట... PF Balance: యూఏఎన్ నెంబర్ గుర్తులేదా? చిటికెలో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా! LPG Saving: ఒక్క నిమిషంలో మీ గ్యాస్ లెవల్ చెక్ చేసుకోండి ఇలా! ఈ సింపుల్ టెక్నిక్ మీకోసమే...! Trump: ట్రంప్ కీలక ప్రకటన! అమెరికాలో భారత దిగ్గజ కంపెనీ ఎంట్రీ! Mercedes Benz: భారత్‌లో మెర్సిడెస్-బెంజ్ కార్ల ధరల పెంపు..! ఏ మోడల్‌పై ఎంతంటే? Drug Racket: కొండపల్లిలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు..! రూ. 47 కోట్ల విలువైన అల్రాజోలం స్వాధీనం! Digi Locker: ఆధార్, పాన్ కార్డులు ఇక అవసరం లేదు! CKYC నెంబర్ ఉంటే చాలు! Gold Rates: పసిడి ప్రేమికులకు శుభవార్త... నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు! LPG Cylinder: అమెరికా-ఇరాన్ యుద్ధ సెగలు..! 14 కేజీల గ్యాస్ ధర వింటే దిమ్మతిరగాల్సిందే! Aadhaar Update: ఆధార్ అప్‌డేట్ గడువు ముగుస్తోంది.. వివరాలు మార్చుకోకుంటే చిక్కులే! Oil Crisis: చమురు సంక్షోభంపై ట్రంప్ సంచలన నిర్ణయం! ప్రపంచ దేశాలకు ఊరట... PF Balance: యూఏఎన్ నెంబర్ గుర్తులేదా? చిటికెలో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా! LPG Saving: ఒక్క నిమిషంలో మీ గ్యాస్ లెవల్ చెక్ చేసుకోండి ఇలా! ఈ సింపుల్ టెక్నిక్ మీకోసమే...! Trump: ట్రంప్ కీలక ప్రకటన! అమెరికాలో భారత దిగ్గజ కంపెనీ ఎంట్రీ!

Cyber Fraud: SBI ఖాతాదారులపై తాజా స్కామ్‌! లింక్ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ!

 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసపూరిత తంతును ప్రారంభించారు. “మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయకపోతే

Published : 2025-11-18 16:23:00
Train Ticket: ట్రైన్ టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు... వెంటనే అమలులోకి!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసపూరిత తంతును ప్రారంభించారు. “మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయకపోతే యోనో యాప్ బ్లాక్ అవుతుంది” అంటూ నకిలీ మెసేజ్‌లు భారీగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ సందేశాల్లో ఒక లింక్‌ను పంపిస్తూ, దానిపై క్లిక్ చేస్తే ఏపీకే (APK) ఫైల్ డౌన్‌లోడ్ అవుతుందని, దానిని ఇన్‌స్టాల్ చేసి తమ వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలని బాధితులకు సూచిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ అంతా పూర్తిగా మోసపూరితమని, ఖాతాదారుల వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారం దొంగిలించడమే ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Egg: ఆకాశాన్ని అంటుతున్న గుడ్డు ధరలు..! చికెన్ తగ్గినా గుడ్డు పైపైకి… ఎందుకో తెలుసా?

ఒక్కసారి ఆ నకిలీ APK ఫైల్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయితే, ఫోన్‌లోని బ్యాంకింగ్ డేటా మొత్తం నేరగాళ్లకు చేరిపోవచ్చు. ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ వివరాలు, యూపీఐ పిన్ వంటి కీలక సమాచారం ఈ యాప్‌ ద్వారా సైబర్ ముఠాలు సేకరిస్తాయి. క్షణాల్లో బ్యాంకు ఖాతాలు ఖాళీ కావడం, అనుమతిలేని లావాదేవీలు జరగడం వంటి భయంకర పరిణామాలు సంభవించవచ్చు. ఇటీవలి రోజుల్లో వాట్సాప్, సోషల్ మీడియాలో ఈ నకిలీ మెసేజ్‌లు విపరీతంగా షేర్ అవుతుండటంతో, అనేక మంది ఈ మోసానికి బలవుతున్నారు.

Sim Card: 5 ఏళ్లుగా ఒకే మొబైల్ నంబర్ వాడుతున్నారా? అయితే…! మీరు ఈ కేటగిరీలో?

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్‌చెక్ బృందం అధికారికంగా స్పందించి హెచ్చరిక జారీ చేసింది. “ఇవి పూర్తిగా నకిలీ సందేశాలు. ఎస్‌బీఐ గానీ, ఇతర బ్యాంకులు గానీ యాప్ అప్‌డేట్‌లు పంపేందుకు ఎప్పుడూ APK ఫైళ్లు షేర్ చేయవు” అని ప్రజలకు స్పష్టం చేసింది. ఎస్‌బీఐ కూడా తమ ఖాతాదారులకు సూచిస్తూ, ఇలాంటి అనుమానాస్పద లింకులను ఎప్పుడూ క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. “క్లిక్ చేసే ముందు ఆలోచించండి. నకిలీ లింకులు మీ సొమ్మును దోచేసే మార్గాలు అవుతాయి” అని బ్యాంక్ స్పష్టం చేసింది.

Vandebharath: వందేభారత్‌కు ఏపీలో చరిత్రాత్మక గ్రీన్‌సిగ్నల్! లూప్‌లైన్‌పై దేశంలోనే తొలి ప్రయాణం

ఖాతాదారులు ఇలాంటి మోసాల నుండి కాపాడుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకింగ్ యాప్‌లు ఎల్లప్పుడూ గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేయాలి. అపరిచితుల నుంచి వచ్చే లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు. అనుమానాస్పద సందేశాలు వస్తే phishing@sbi.co.in కు మెయిల్ చేయాలి లేదా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలి. ఆధార్ అప్‌డేట్ చేయాలంటే, UIDAI అధికారిక వెబ్‌సైట్ లేదా సర్టిఫైడ్ సేవా కేంద్రాలను మాత్రమే ఉపయోగించాలి. డిజిటల్ సర్వీసులు విస్తరిస్తున్న తరుణంలో, ఇటువంటి మోసాలపై మరింత అప్రమత్తత అవసరం అని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Netizens angry: హనుమాన్‌పై వ్యాఖ్యలు… రాజమౌళిపై నెటిజన్ల ఆగ్రహం!
భారత విద్యార్థులకు షాక్.. 96% యూనివర్సిటీల ఆందోళన! హెచ్-1బీ వీసాలపై నిఘా, కఠిన నిబంధనలు!
TTD: శ్రీవారి దర్శనాలలో కీలక మార్పులు! తొలి 3 రోజులు ఆ దర్శనాలకు బ్రేక్‌!
భయం, థ్రిల్ కావాలంటే ఈ 5 అద్భుతమైన హారర్ సిరీస్‌లు చూడాల్సిందే! రాత్రి ఒంటరిగా చూడకండి..
iBOMMA News: భార్య–అత్త అవమానాలే నన్ను ఈ దారికి నెట్టాయి… పోలీస్ విచారణలో ఐ బొమ్మ రవి సంచలన వ్యాఖ్యలు!!
Title event : వారణాసి టైటిల్ ఈవెంట్ కోసం రూ.30 కోట్లు ఖర్చు.. రాజమౌళి మహేశ్ బాబు!

Spotlight

Read More →