కిడ్నాప్, హత్యాయత్నం కేసులో తెనాలికి చెందిన వైకాపా కార్పొరేటర్, అతనికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తెనాలి త్రీటౌన్ సీఐ రమేశ్ బాబు తెలిపిన సమాచారం మేరకు.. వైకాపా కౌన్సిలర్ అహ్మద్ బేగ్ ఈ నెల 5న కార్పెంటర్ షేక్ మస్తాన్ వలిని పట్టపగలే కారులో బలవంతంగా ఎక్కించుకుని విజయవాడ వరకూ తీసుకువెళ్లారు. కారులో అతన్ని చితకబాదుతూ డబ్బుల కోసం డిమాండ్ చేశాడు. బాధితుడితో పది లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకుని తిరిగి తెనాలిలో వదిలిపెట్టాడు. బాధితుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దీనిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అహ్మద్ బేగ్‌పై గతంలో రెండు కిడ్నాప్ కేసులు ఉన్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో పలు దౌర్జన్యాలకు పాల్పడటంతో అతనిపై రౌడీ షీట్ కూడా తెరిచారు. ఘటన జరిగిన నాటి నుండి పరారీలో ఉన్న అహ్మద్, అతనికి సహకరించిన రహమాన్ తెనాలికి వచ్చినట్లు సమాచారం అందడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు షేక్ ఇర్ఫాన్, షేక్ హుమయూన్ క్రిస్టీ పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు.
ఇది కూడా చదవండి: తల్లికి వందనం పథకంపై అపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్! డేట్ ఫిక్స్! ఈ నెలలో...
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!
ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!
ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!
ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!
ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!
పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!
గుంటూరులో జగన్ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: