వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి (Former MLA Chevireddy Bhaskar Reddy) ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంగించారంటూ నమోదైన ఐదు కేసులకు సంబంధించి చెవిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నుంచి వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేశారు. అయితే ఎన్నికల సమయంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చెవిరెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఎర్రగొండపాలెంలో మూడు కేసులు, దోర్నాల, పెద్దారివీరుడులో ఒక్కొక్క కేసు నమోదు అయ్యింది. ఐదు కేసులపై ఎర్రగొండపాలెం పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నోటీసులు ఇచ్చారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో చెవిరెడ్డికి నోటీసులు ఇచ్చారు పోలీసులు.
ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన! 30 వేల మంది పైలట్లు అవసరం..
ఐదు కేసులో ఎర్రగొండపాలెం ఆర్వో శ్రీలేఖను బెదిరించిన కేసు కూడా ఉంది. 2024 ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా ఎన్నికల నియామాలను ఉల్లంఘించారంటూ అప్పట్లోనే చెవిరెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి. అందులో ఎర్రగొండపాలెంలో నమోదైన మూడు కేసుల్లో ఆర్వో శ్రీలేఖను తనకు అనుకూలంగా పనిచేయడం లేదంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెదిరించిన కేసు ఉంది. దీంతో పాటు దోర్నాల, పెద్దారివీరుడులో కూడా ఎన్నికల నియమావళిని వైసీపీ నేత ఉల్లంఘించి.. ఎన్నికల ప్రచారం నిర్వహించారని అప్పట్లోనే కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులకు సంబంధించి విచారణకు హాజరుకావాలని ఎర్రగొండపాలెం పోలీసులు చెవిరెడ్డికి నోటీసులు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: వర్రా కేసులో కీలక మలుపు! సెంట్రల్ జైలు వద్ద పోలీసుల హైఅలర్ట్!
కాగా.. ఇప్పటికే వైసీపీ నేతలు వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళిపై పలు కేసులు నమోదు అవగా.. వారిని అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ఫిర్యాదుదారుడు సత్యవర్థన్ బెదిరింపు, కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసానిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరి పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించి చెవిరెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గత ప్రభుత్వంలో మహిళలకు న్యాయం లేదు.. నాపైనే 23 కేసులు! హోంమంత్రి ఘాటు వ్యాఖ్యలు!
టీటీడీకి భారీ విరాళాలు! తిరుమల అన్నప్రసాద సేవలో విప్లవాత్మక మార్పులు!
అమరావతి అభివృద్ధికి భారీ నిధులు.. చంద్రబాబు నేతృత్వంలో కీలక భేటీ! కోట్ల నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్!
రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఘర్షణ! అసెంబ్లీలో కీలక ప్రకటన!
జేఈఈ మెయిన్ 2025 తుది విడత కీలక షెడ్యూల్ విడుదల! ఏ పరీక్ష ఏయే తేదీల్లో అంటే!
ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్... రాజమండ్రి సెంట్రల్ జైలుకు రౌడీషీటర్ ఎంట్రీ! ముగిసినా అజ్ఞాతం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: