2024లో ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగంలో గణనీయమైన వృద్ధి ...ప్రముఖ వెబ్‌సైట్ Go2Africa తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, పర్యాటకులను అత్యధికంగా ఆకర్షించిన దేశాల్లో ఫ్రాన్స్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ దేశం సంవత్సరానికి సుమారు 100 మిలియన్లకు పైగా విదేశీ పర్యాటకులను ఆహ్వానించడంతో, ఇది ప్రపంచంలోనే అత్యధిక పర్యాటకులు వచ్చే దేశంగా నిలిచింది. ఇక్కడి పారిస్ నగరం, చారిత్రక మ్యూజియాలు, కళా సౌందర్యం, ఆల్ప్స్ పర్వతాలు వంటి ప్రత్యేకతలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి.
ఫ్రాన్స్‌ను అనుసరించి స్పెయిన్ (94 మిలియన్లు), అమెరికా (72.4 మిలియన్లు), ఇటలీ (68.5 మిలియన్లు), టర్కీ (52.6 మిలియన్లు) దేశాలు టాప్ 5లో చోటు దక్కించుకున్నాయి. ఈ దేశాల్లోని చారిత్రక ప్రాంతాలు, విభిన్న భాషలు, సాంస్కృతిక వైవిధ్యం, ప్రకృతి అందాలు వంటి అంశాలు ప్రపంచ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇటలీలోని రోమ్, వెనిస్, ఫ్లోరెన్స్ లాంటి నగరాల్లో కళా సంపద, ఆర్చిటెక్చర్ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
ఇక మెక్సికో (45 మిలియన్లు), హాంకాంగ్ (44.5 మిలియన్లు), యునైటెడ్ కింగ్‌డమ్ (41.2 మిలియన్లు), గ్రీస్ (40.7 మిలియన్లు), జపాన్ (36.9 మిలియన్లు) వంటి దేశాలు కూడా టాప్ 10లో నిలిచాయి. జపాన్‌లోని సాంప్రదాయ దేవాలయాలు, టెక్నాలజీ అద్భుతాలు, చక్కటి రోడ్డు వ్యవస్థ వంటి అంశాలు పర్యాటకులకు అనుభూతికరంగా మారాయి. అలాగే గ్రీస్‌లోని ద్వీపాలు, హిస్టారికల్ రూన్స్ పర్యాటకులను మాయ చేయగలిగాయి.
ఈ లెక్కల ప్రకారం చూస్తే, ప్రపంచ పర్యాటక రంగం కోవిడ్ అనంతర కాలంలో తిరిగి నిలదొక్కుకుంటున్నది. ఆయా దేశాల ప్రభుత్వం, ప్రజలు పర్యాటకులకు మెరుగైన అనుభవం కలిగించే విధంగా తీసుకుంటున్న చర్యలు ఫలితంగా, ఈ స్థాయిలో వృద్ధి సాధ్యపడింది. భవిష్యత్తులో పర్యాటక రంగానికి ఇది మరింత వృద్ధికి దారితీయనుంది.