ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా నెలలుగా కొనసాగుతున్న అవకతవకలు, డూప్లికేట్ హాజరులను అరికట్టే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన Facial Attendance విధానాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. ఆగస్టు 10వ తేదీ నుంచి ఈ విధానం అధికారికంగా అమలులోకి రానుంది. దీని ద్వారా ఒక్కే వ్యక్తి వేర్వేరు పేర్లతో హాజరు అయ్యే అవకాశాన్ని పూర్తిగా నిరోధించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
ఇప్పటికే గ్రామీణాభివృద్ధి శాఖ దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలుపెట్టింది. జిల్లా స్థాయిలో మాస్టర్ ట్రైనర్లు క్షేత్ర స్థాయి సిబ్బందికి శిక్షణనిస్తున్నారు. కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యే సమయంలో ఉదయం, సాయంత్రం రెండు సార్లు ఫొటోలు తీసి NMMS యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకరు బదులుగా మరొకరు హాజరయ్యే అవకాశాన్ని యాప్ గుర్తించి నిరాకరిస్తుంది. ఇలా ఆన్‌లైన్‌లో నిఖార్సైన హాజరు నమోదవుతుంది.
గతంలో ఒకే వ్యక్తి, వేర్వేరు పనులకై వేర్వేరు Job Cards ఉపయోగించి హాజరయ్యే ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది మరణించిన వారి పేర్లతో కూడా డబ్బులు పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఫేషియల్ అటెండెన్స పద్ధతి అమలు ఇటువంటి మోసాలు ఇకపై జరగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.
ఈ మార్పు వల్ల రాష్ట్రవ్యాప్తంగా పారదర్శకత పెరుగుతుంది. కూలీలకు రావలసిన డబ్బులు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చేస్తుంది. ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన వ్యవస్థను తిరిగి నమ్మదగినదిగా మార్చేందుకు ఇది కీలకమైన అడుగు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఆధారిత చర్యలు ప్రజల్లో చైతన్యం పెంచనున్నాయి.