Movie update: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తన ఎనర్జీతో ఎప్పుడూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంటారు. ఇప్పుడు ఆయనతో కలిసి యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించబోతున్నారనే వార్త ఫిల్మ్ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే అభిమానుల్లో నిర్మాతల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ కథను రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ రాసారట. ఆయన దర్శకత్వ బాధ్యతలు కూడా స్వీకరించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కానీ ఫైనల్ డైరెక్టర్ పేరు త్వరలోనే క్లారిటీకి వస్తుందని అంటున్నారు. రవితేజ, నవీన్ పోలిశెట్టి ఇద్దరికీ స్క్రిప్ట్ వినిపించగా, ఇద్దరూ కథ నచ్చి అంగీకరించారట.
రవితేజ ఎప్పటిలాగే తన మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, హై ఎనర్జీ పర్ఫార్మెన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంటారు. ప్రస్తుతం ఆయన నటించిన మాస్ జాతర సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ఆయన సరసన శ్రీలీల నటించింది. ధమాకా తర్వాత ఈ జంట స్క్రీన్‌పై మళ్లీ కనిపించబోతుండడంతో ఆ సినిమాపై కూడా మంచి బజ్ ఉంది.
మరోవైపు నవీన్ పోలిశెట్టి తన కామెడీ టైమింగ్, స్మార్ట్ డైలాగ్ డెలివరీతో యూత్ ఆడియన్స్‌కి దగ్గరయ్యారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి సినిమాలతో ఆయన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు రవితేజ వంటి మాస్ స్టార్‌తో కలిసి నటించబోతున్నారన్న వార్త ఆయన ఫ్యాన్స్‌ని ఉత్సాహపరుస్తోంది.
ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయితే, స్క్రీన్‌పై రవితేజ ఎనర్జీకి నవీన్ పోలిశెట్టి హాస్యం కలిసినపుడు ఫన్, ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ గ్యారంటీ అంటున్నారు సినీ వర్గాలు. టాలీవుడ్‌లో ఇటీవల మల్టీస్టారర్ సినిమాలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ కూడా పెద్ద స్థాయిలో ప్లాన్ చేయబోతున్నారని తెలుస్తోంది.
ఇక నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం నటిస్తున్న అనగనగా ఒక రాజు సంక్రాంతికి విడుదల కానుంది. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.
ఫ్యాన్స్ కోణంలో చూస్తే రవితేజకు ఇది డబుల్ ఫెస్టివల్. ఒకవైపు మాస్ జాతర రిలీజ్‌కి రెడీ అవుతుండగా, మరోవైపు నవీన్‌తో కొత్త మల్టీస్టారర్ అనౌన్స్‌మెంట్ పబ్లిక్‌లో ఆసక్తి రేపుతోంది.