రాష్ట్ర ప్రజలకు పారదర్శకంగా రేషన్ సరఫరా చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త అడుగు వేస్తోంది. ఆగస్టు 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరగనుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ స్మార్ట్ కార్డులను క్యూఆర్ కోడ్ సిస్టమ్ ఆధారంగా రూపొందించామని, దీని వలన ఎలాంటి అక్రమాలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు.
“రాష్ట్రంలో కొత్తగా 9 లక్షల మందికి పైగా రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29,796 రేషన్ దుకాణాల ద్వారా ప్రతినెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సరఫరా కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ప్రజలు తమ రేషన్ పొందవచ్చు. ప్రత్యేకంగా 5 సంవత్సరాల లోపు పిల్లలు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఈ-కేవైసీ అవసరం లేదు” అని మంత్రి నాదెండ్ల వివరించారు.
అలాగే, ప్రభుత్వం ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీని మరింత సమర్థవంతంగా, వేగవంతంగా చేసి, లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బెనిఫిట్స్ పొందేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
చంద్రబాబు టైర్స్ కంపెనీ తెచ్చారు.. జగన్ కనీసం సైకిల్ ట్యూబ్ కంపెనీ అయినా తెచ్చారా..? ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అహర్నిశలు శ్రమిస్తున్నారని రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి (డీబీవీ స్వామి) అన్నారు. గతంలో పెట్టుబడుల పేరుతో వైకాపా నేతలు విదేశాల్లో విహారయాత్రలు చేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
జగన్ తన విధ్వంస పాలనలో సింగపూర్తో రాష్ట్రానికి ఉన్న సత్సంబంధాలు దెబ్బతీశారని మంత్రి మండిపడ్డారు.
నేడు చంద్రబాబుపై నమ్మకంతో ఏపీకి పరిశ్రమలు క్యూ కడుతున్నాయన్నారు. చంద్రబాబు అపోలో టైర్స్ కంపెనీ తెచ్చారు.. గత ఐదేళ్లలో జగన్ కనీసం సైకిల్ ట్యూబ్ కంపెనీ అయినా తెచ్చారా అని మంత్రి ఎద్దేవా చేశారు. పరిశ్రమలు, పెట్టుబడులతో రాష్ట్ర యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్నామన్నారు. నాడు కాకమ్మ కథలు చెప్పిన వారు నేడు పెట్టుబడులపై విమర్శించడం సిగ్గుచేటని మంత్రి దుయ్యబట్టారు.