ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినికిడి లోపంతో బాధపడే పౌరుల కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. సామాజిక న్యాయం, డిజిటల్ సాధికారత లక్ష్యంగా—వినికిడి లోపం ఉన్న లబ్ధిదారులకు ఉచితంగా smartphones పంపిణీ చేయడం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా సమాచారానికి చేరువయ్యే అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి 1.52 లక్షల విలువగల టచ్ ఫోన్లను పంపిణీ చేశారు. ఒక్కో ఫోన్ విలువ దాదాపు ₹19,000 కాగా, మొత్తం ఎనిమిది మంది లబ్ధిదారులకు ఈ మొబైల్స్ లభించాయి. ఈ ఫోన్లను అందుకోవడానికి కొన్ని అర్హత ప్రమాణాలు ఉన్నాయి. లబ్ధిదారులు దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలి, ration card కలిగి ఉండాలి, అలాగే కనీసం 40 శాతం వినికిడి వైకల్యం ఉండాలి.
ఇటు వినికిడి లోపంతో బాధపడే వారు ఇంటర్మీడియట్ స్థాయి విద్యనైనా పూర్తి చేసి ఉండాలి. ముఖ్యంగా sign language లో నైపుణ్యం ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. ఈ టచ్ ఫోన్ల ద్వారా వారు ప్రభుత్వ సేవలు, డిజిటల్ ఉపాధి అవకాశాలు, ఆరోగ్య సమాచారం వంటి అవసరాలకు సులభంగా చేరుకుంటారు. ఇది ఒక విధంగా వారి జీవన ప్రమాణాన్ని మెరుగుపరచే దిశగా తీసుకున్న ముందడుగు.
ఇకపోతే, ఈ కార్యక్రమం పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కింద అమలవుతుంది. ఇది వినికిడి లోపంతో బాధపడే పౌరులకే పరిమితం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ యోచన వినికిడి లోపం గలవారిలో డిజిటల్ అంతరాన్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషించనుంది.
ఇలాంటి సంక్షేమ పథకాలు సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడమే కాకుండా, టెక్నాలజీ ద్వారా సమస్యల పరిష్కారానికి దోహదపడతాయి.