బాలీవుడ్ స్టార్ జంట కత్రినా కైఫ్–విక్కీ కౌశల్ ప్రేమకథ అందరికీ తెలిసిందే. కొంతకాలం ప్రేమలో మునిగిపోయిన చివరికి ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే ఆ సమయంలో కత్రినాకి ఉన్నంత ఫేమ్, విక్కీకి పెద్దగా లేని లేదనే చెప్పుకోవచ్చు.వివాహం అనంతరం తర్వాత పరిస్థితి మారింది. వరుస విజయాలతో విక్కీ కౌశల్ బాలీవుడ్ స్టార్ హీరోల జాబితాలో ఆయనకంటూ ప్రత్యేకమైన కనబరుచుకున్నారు. కత్రినా గ్లామర్ పాత్రలకి పుల్ స్టాప్ పెట్టి అరకురో సినిమాలు చేసిన అవి కూడా ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి.
ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కత్రినా కనిపిస్తే చాలు ప్రెగ్నెంట్ అయినట్టు పలు పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే వాటిపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ కత్రినా కైఫ్ ఫోటోలు షేర్ చేసుకుంటూ వచ్చింది. అయితే తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్ మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఫొటోపై అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
అభిమానులు ఎదురుచూసిన వార్తలకు నిజం చేస్తూ కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ దంపతులు ఇంస్టాగ్రామ్ వేదిక ద్వారా శుభవార్తను తెలియజేశారు.. త్వరలోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నామని అధికారికంగా ప్రకటించారు. ఎంతో ప్రేమతో, కృతజ్ఞతతో మరియు ఆనందంతో మా జీవితంలో ఉత్తమ అధ్యాయాన్ని కొనసాగించే దశలో ఉన్నామని క్యాప్షన్ రాసుకొచ్చారు.
ఆ పిక్ లో కత్రినా కైఫ్ బెల్లీను విక్కీ పట్టుకొని చూస్తూ ఉన్న ఫోటోను షేర్ చేశారు. బాలీవుడ్ స్టార్స్ నుంచి అలానే అభిమానుల నుండి ఈ జంటకు కంగ్రాట్యులేషన్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు అది కాస్త ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.