బంగారం సాంప్రదాయక కట్టుబాటులతో అత్యధిక ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఒకప్పుడు బంగారం అంటే అదో గొప్ప సంపద, బంగారం ధరించిన స్త్రీని చూస్తే సాక్షాత్తు అమ్మవారి రూపం దర్శనమిచ్చేలా ఉట్టిపడేవారు. కానీ నేటి సమాజంలో బంగారానికి మించిన నగలు ఎన్నో వచ్చిన బంగారానికి ఏదీ సాటి కాదని చెప్పుకోవచ్చు. మన తాతఅమ్మమ్మ తరం, మన తరం బంగారాన్ని కొనుక్కుని స్థాయిలో ఉన్నామనే చెప్పు. అయితే రానున్న 2026 మరియు 2027మధ్య నాటికీ తులం బంగారం 2 లక్షల ఉండేలా ఉందండోయ్.
ఇటీవలే బంగారం ధరలు భారీగా పెరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రామము బంగారం ధర రూ 2,200పెరిగి రూ 1.16,200 రికార్డ్ గరిష్ట స్థాయికి చేరింది. తులం బంగారం ధర ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే ఏడాది తారస్థాయి కి చేరుతుంది అని చెప్పడంలో నిస్సందేహమే లేదు.
5 సంవత్సరాల క్రితం 2020 సెప్టెంబరులో 10 గ్రాముల 24 క్యారెట్ ప్యూర్ బంగారం ధర సుమారు రూ.51,619 గా ఉండేది. ఇప్పుడు అది రెండింతలుగా, అంటే సుమారు రూ.1.12 లక్షల వరకు పెరిగింది. ఈ రేట్లు కొనసాగితే వచ్చే 5 సంవత్సరాల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.2 లక్షలకు చేరుతుందని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు.
బంగారం పెరుగుదలకు మరొక కారణంగా కరోనా సమస్య, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా వాణిజ్య విధానాలు, ఇతర అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు బంగారం ధరలను ప్రభావితం చేశాయి. గ్లోబల్ ట్రేడింగ్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) పెరుగుతుండటం కూడా ధరలను పైకి నెట్టే ఒక కారణంగానే చెప్పుకోవచ్చు. గత ఏడాదిలో గోల్డ్ ETF రిటర్న్స్ సుమారు 47% పైగా ఉన్నాయి.
గతంలో 2005లో 10 గ్రాముల బంగారం ధర రూ.7,000గా ఉండగా. 2010కి రూ.18,500, 2015కి రూ.26,300, 2025కి రూ.1,10,000కు పెరిగింది. ఈ రేట్లతో చూస్తే, వచ్చే కొన్ని సంవత్సరాల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిపుణుల అంచనా ప్రకారం, 2026 నాటికి అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర 4,000 డాలర్లకు చేరవచ్చు. ఇది దేశీయంగా రూ.1,18,000–1,20,000 వరకు ఉండవచ్చని, 2–5 సంవత్సరాల్లో రూ.1,70,000–2 లక్షల స్థాయి వరకు చేరవచ్చు.అందుచేత బంగారంపై పెట్టుబడి పెట్టడం వల్ల రానున్న తరాలకు అదొక మంచి ఆర్థిక వనరుగా ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో బంగారు షాపుల్లో నెలకి ఇంత అమౌంట్ కట్టుకునే అవకాశాలు కూడా వచ్చాయి కాబట్టి మధ్యతరగతి వారు కూడా దీనిపై ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదే సుమీ.