LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

AP Nominated posts: ఏపీలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్‌గా.. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.. 13 మంది కొత్తగా నియామకం!

AP Nominated posts: మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నియామకాలు చేపడుతూ రెండు వేర్వేరు ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణతో పాటు ఉర్దూ అకాడమీకి కొత్త వైస్ చైర్మన్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వుల ప్రకారం న…

AndhraPravasi News Desk 2 min read
AP Nominated posts: ఏపీలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్‌గా.. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.. 13 మంది కొత్తగా నియామకం!
  • Politics: గెజిట్ నోటిఫికేషన్ విడుదల: రాష్ట్ర హజ్ కమిటీ విధివిధానాలపై ప్రభుత్వం స్పష్టత..
     
  • ముస్లిం మైనారిటీల సంక్షేమమే ధ్యేయం: హజ్ కమిటీ మరియు ఉర్దూ అకాడమీలో కీలక పదవుల భర్తీ..

AP Nominated posts: మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నియామకాలు చేపడుతూ రెండు వేర్వేరు ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణతో పాటు ఉర్దూ అకాడమీకి కొత్త వైస్ చైర్మన్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వుల ప్రకారం నియామక వివరాలు ఈ  విధంగా ఉన్నాయి..

ఏపీ రాష్ట్ర హజ్ కమిటీ నియామకం
హజ్ కమిటీ చట్టం 2002 ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. మొత్తం 13 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పండితులు  సామాజిక కార్యకర్తలకు చోటు కల్పించారు.

హజ్ కమిటీ సభ్యుల పూర్తి జాబితా:
మహ్మద్ నశీర్ అహ్మద్ – ఎమ్మెల్యే (సభ్యుడు).
అబ్దుల్ అజీజ్ – ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ (సభ్యుడు).
షేక్ హసన్ బాషా – సామాజిక కార్యకర్త (సభ్యుడు).
మీరా సాహెబ్ షేక్ – సామాజిక కార్యకర్త (సభ్యుడు).
మీర్జా అబీద్ హుస్సేన్ బేగ్ – సామాజిక కార్యకర్త (సభ్యుడు).
ఎన్. బాబా ఫక్రుద్దీన్ – సామాజిక కార్యకర్త (సభ్యుడు).
మౌలానా అబ్దుల్ అలీమ్ జునైద్ – ముస్లిం మత పండితుడు (సభ్యుడు).
మౌలానా షేక్ అబీద్ – ముస్లిం మత పండితుడు (సభ్యుడు).
ఎస్. రేష్మా పర్వీన్ – స్థానిక సంస్థల ప్రతినిధి (సభ్యురాలు).
షేక్ అబ్దుల్ హుస్సేన్ – స్థానిక సంస్థల ప్రతినిధి (సభ్యుడు).
సూరి మన్సూర్ అలీ ఖాన్ – సామాజిక కార్యకర్త (సభ్యుడు).
సయ్యద్ షాజీ సుల్తాన్ మూసవి – ముస్లిం మత పండితుడు (సభ్యుడు).
షేక్ జబీన్ – స్థానిక సంస్థల ప్రతినిధి (సభ్యురాలు).
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ – ఏపీ రాష్ట్ర హజ్ కమిటీ (ఎక్స్-అఫీషియో మెంబర్, కన్వీనర్).

పదవీ కాలం విధివిధానాలు..
ఈ కమిటీలోని ముస్లిం మత పండితులు (జాబితాలో 7,  8 సంఖ్యల వద్ద ఉన్నవారు) మౌలానా అబ్దుల్ అలీమ్ జునైద్,  మౌలానా షేక్ అబీద్‌లు గెజిట్ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుండి మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. మిగిలిన సభ్యుల పదవీ కాలం గతంలో జారీ చేసిన జి.ఓ. నం. 38 (తేదీ: 16.04.2025) ప్రకారం ఉంటుంది. ఈ కమిటీ మైనారిటీ సంక్షేమ శాఖ పరిపాలనా నియంత్రణలో పనిచేస్తుంది.

ఏపీ ఉర్దూ అకాడమీ నియామకాలు..
విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ పాలక మండలికి కొత్త నియామకాలను చేపడుతూ ప్రభుత్వం జి.ఓ.ఆర్.టి. నంబర్ 35ను విడుదల  చేశారు. ఉర్దూ భాషాభివృద్ధికి  అకాడమీ కార్యకలాపాలకు ఊతమిచ్చేలా ఈ నియామకాలు జరిగాయని సమాచారం.

కీలక నియామకాలు..
పటన్ ఖాదర్ ఖాన్ – ఏపీ రాష్ట్ర ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ గా నియామకం.
మాబు బాషా షేక్ – ఏపీ రాష్ట్ర ఉర్దూ అకాడమీ బోర్డు సభ్యుడు (ప్రముఖ ఉర్దూ వ్యక్తి కోటాలో) నియామకం.
నియామక కాలపరిమితి... వీరు తమ పదవుల్లో బాధ్యతలు చేపట్టిన తేదీ నుండి రెండు సంవత్సరాల కాలం పాటు కొనసాగుతారు. ప్రభుత్వ కార్యదర్శి చిత్తూరి శ్రీధర్ పేరుతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నియామకాల ద్వారా రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీల సంక్షేమానికి  ఉర్దూ భాషా వికాసానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని అధికారులు తెలిపారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…