ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో బీజేపీ నేత గుల్ఫం సింగ్ యాదవ్ దారుణ హత్యకు గురయ్యారు. 60 ఏళ్ల యాదవ్ తన పొలంలో కూర్చున్న సమయంలో, ముగ్గురు అనుమానితులు బైక్‌పై వచ్చి అతనిని కలుసుకున్నారు. మెల్లగా మాటల్లో పెట్టి, ఆత్మీయంగా మాట్లాడిన తర్వాత, వారు అతనికి విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యారు. ఇంజెక్షన్ ప్రభావంతో యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో, కుటుంబ సభ్యులు వెంటనే అతనిని అలీఘర్ మెడికల్ కాలేజీకి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యలోనే అతను ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ బృందాలను నియమించారు. అక్కడ ఖాళీ ఇంజెక్షన్, హెల్మెట్ లాంటి ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. యాదవ్ 2004లో గన్నౌర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేయగా, రాజకీయంగా అనేక పదవులను నిర్వహించారు. ఈ హత్యపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు కూడా యాదవ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. పోలీసులు త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!
ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!
బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!
ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!
వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?
ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!
జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: