దేశాధినేతలు విదేశీ పర్యటనకు వెళ్తున్నారంటే భారీ స్థాయిలో ఏర్పాట్లు ఉంటాయి. స్వదేశంలో బయలుదేరినప్పటికీ నుంచి విదేశంలోనూ భారీ భద్రత నడుమ వీరి పర్యటన కొనసాగుతుంది. కానీ, ఇటీవల భూటాన్ పర్యటనకు వెళ్లిన థాయ్లాండ్ రాజదంపతులు స్వయంగా విమానాన్ని నడుపుతూ ఆతిథ్యదేశంలో అడుగు పెట్టడం విశేషం. ప్రపంచంలో అత్యంత సవాళ్లతో కూడిన విమానాశ్రయాల్లో ఒకటైన పారో ఎయిర్పోర్టులో సేఫ్ ల్యాండింగ్ చేసిన ఆ రాజదంపతులపై సామాన్యులు సహా విమానయాన నిపుణులు ప్రశంసలు కురిపిస్తున్నారు. భూటాన్ రాజు ఆహ్వానం మేరకు థాయ్లాండ్ రాజు మహా వజ్రలాంగ్కోర్న్.. రాణి సుతీదాలు ఇటీవల భూటాన్ పర్యటన చేపట్టారు.
ఇది కూడా చదవండి: దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకలో సందడి చేసిన పలువురు ప్రముఖులు!
ఇందులో భాగంగా రాజకుటుంబానికి చెందిన బోయింగ్ 737-800 విమానాన్ని స్వయంగా నడిపారు. భూటాన్లోని పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండైన వీరికి అక్కడి రాజదంపతుల నుంచి ఘన స్వాగతం లభించింది. థాయ్ రాజ దంపతలు భూటాన్లో అధికారికంగా పర్యటించడం ఇదే తొలిసారి. నాలుగురోజులు అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న థాయ్లాండ్ రాజదంపతులు తిరుగు ప్రయాణంలోనూ స్వయంగా విమానం నడుపుతూ వెళ్లారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఇదిలాఉంటే, రాయల్ థాయ్ ఆర్మీలో రాజు మహా వజ్రలాంగ్్కర్న్ గతంలో కెరీర్ ఆఫీసర్గా సేవలందించారు. ఎఫ్-5, ఎఫ్-16తోపాటు బోయింగ్ 737-400ను నడిపే అర్హత సాధించారు. 2019లో రాజుగా వజ్రలాంగ్కోర్న్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..
సీఐడీ కస్టడీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..
మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?
ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!
గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: