భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. కొమొరిన్ ఏరియా.. అంటే.. దక్షిణ భారత దేశంపై ఒక అల్పపీడనం ఉంది. ఇది భూమి నుంచి 5.8 కిలోమీటర్ల వరకూ మేఘాలను కలిగివుంది. అంటే.. ఇది చాలా పెద్దది కింద లెక్క. దీనికి సరైన గాలులు తోడైతే.. మేఘాలు మరింత పెరిగి.. తుపానుగా మారే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ.. ప్రస్తుతం గాలుల దిశ ఒకే విధంగా లేదు. అందువల్ల ఇది తుపాను అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అరేబియా సముద్రంలో ఓ భారీ అల్పపీడనం ఉంది. ఇది భారత్‌కి నైరుతీ దిశలో మాల్దీవులు, లక్షద్వీప్ దగ్గర్లో ఉంది. దాని ప్రభావం తమిళనాడు, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్‌తోపాటూ.. మన ఏపీ, తెలంగాణపై కూడా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో గురువారం మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నా.. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వానలు పడవు. కానీ.. భయంకరమైన సుడిగాలులు రాబోతున్నాయి. ఆ వివరాలు చూద్దాం. ప్రెసిపిటేషన్ అంచనాల ప్రకారం.. ఏపీ, తెలంగాణలో ఉదయం నుంచి భారీ సుడిగాలులు.. మేఘాలను మోసుకొస్తాయి. ఇవి రోజంతా ఉంటాయి. మేఘాలు కూడా రోజంతా పరుగులు పెడుతూ ఉంటాయి. మేఘాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఎండ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఐతే.. విపరీతమైన గాలులు.. కొంత ఉపశమనం కలిగిస్తాయి. గురువారం బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు 19 కిలోమీటర్లుగా ఉంటుంది. ఏపీలో గంటకు 17 కిలోమీటర్లుగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: బ్రేకింగ్ న్యూస్..! తిరుమలలో వారికి అనుమతులు ఇవ్వద్దు అంటూ హెచ్చరించిన హైకోర్టు!
తెలంగాణలో గంటకు 15 కిలోమీటర్లుగా ఉంటుంది. ఈ గాలులతో జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ జ్వరం ఉన్నవారు.. ఈ గాలి తగలకుండా చూసుకోవాలి. ఇవి భయంకర గాలులు. ఇవి అరేబియా సముద్రం నుంచి రెండు రాష్ట్రాల్లోకి వస్తున్నాయి. వీటిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది జలుబు, జ్వరం వచ్చేలా చెయ్యగలదు. ఉష్ణోగ్రతలు చూస్తే.. బంగాళాఖాతంలో గురువారం 28 డిగ్రీల సెల్సియస్ వేడి ఉంటుంది. ఏపీలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. తెలంగాణలో 36 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ముఖ్యంగా ఆదిలాబాద్‌లో 40 డిగ్రీల సెల్సియస్ కూడా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. అంటే మనం గురువారం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఎండలో బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. తప్పనిసరై వెళ్లాల్సి వస్తే.. నీరు, పండ్ల రసాలు తాగుతూ.. బాడీ డీ-హైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. తేమ రెండు రాష్ట్రాల్లో 35 శాతం ఉంది. మేఘాలు బాగా వస్తే.. తేమ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కారు, బస్సు వంటి వాహనాల్లో ప్రయాణాలు చేసేవారికి గురువారం బాగుంటుంది. ఐతే.. టూవీలర్లపై వెళ్లే వారికి మాత్రం ఎండ ప్రభావం పడుతుంది. వారు అక్కడక్కడా చెట్ల నీడలో ఆగుతూ వెళ్లడం మేలు. ఒక మంచి విషయం ఏంటంటే.. ఈ సంవత్సరం వర్షాలు నార్మల్‌గా పడతాయని వాతావరణ అధికారులు తెలిపారు. గత సంవత్సరం లాగానే.. నైరుతీ రుతుపవనాలు టైమ్ ప్రకారం కేరళకు రావచ్చని అంటున్నారు. ఐతే దానికి ఇంకా 3 నెలల టైమ్ ఉంది. ఈ మూడు నెలల్లో ఎండలు తీవ్రంగా ఉండేలా కనిపిస్తున్నాయి. ఇవి అయిపోయిన తర్వాతే మనకు ఉపశమనం ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. 3 టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు - అక్కడే.! ఆ ప్రాంతాలకు మహర్దశ
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!
తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!
ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!
రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..
వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: