ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు మోకాళ్ళ నొప్పులు సమస్యలతో బాధపడుతున్నారు. అసలు ఆ సమస్య కారణాలు ఏంటో తెలుసా? వయసుతో సంబంధం లేకుండా కొందరికి మోకాళ్ల నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. దీని వెనుక కారణాలు శరీర బరువు, జీవనశైలి, ఆహారం వంటివి కావచ్చు. అయితే కొన్ని ఆహారాలు మోకాళ్ల నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ తినే ఆహారంలో కొన్ని పదార్థాలు చేర్చితే మోకాళ్లకు టాటా చెప్పవచ్చట.
చేపల సాల్మన్, ట్యూనా, మకరెల్ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపును తగ్గిస్తాయి. మోకాళ్ల దగ్గర ఇన్‌ఫ్లమేషన్ తగ్గి నొప్పి తగ్గుతుంది. వారానికి కనీసం రెండు సార్లు ఈ చేపలు తింటే మేలు చేస్తుంది.పసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీ. వాపు, నొప్పిని నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. పసుపు వేసిన వేడి పాలు తాగడం లేదా వంటల్లో వాడడం మంచిది.
అల్లం అల్లం వలన మోకాళ్ల నొప్పి తగ్గుతుంది. ఇందులో ఉన్న గుణాలు వాపు తగ్గించడంలో ఉపయోగపడతాయి. అల్లం టీ లేదా అల్లం నీరు రోజూ తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇది సహజమైన ఔషధంలా పని చేస్తుంది.పాలకూర ఆకుకూరల్లో విటమిన్ A, C, K ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. రోజూ ఆకుకూరలు తింటే కీళ్ల సమస్యలు తగ్గుతాయి.
ఆలివ్ ఆయిల్ దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. వంటల్లో, సలాడ్‌ల్లో వాడితే మోకాళ్ల నొప్పి తగ్గుతుంది. సాధ్యమైనంత వరకు రిఫైన్డ్ ఆయిల్ తగ్గించి ఆలివ్ ఆయిల్ వాడాలి.వాల్‌నట్స్ వీటిలో కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కీళ్ల వాపును తగ్గిస్తాయి. రోజూ కొన్ని వాల్‌నట్స్ తినడం మంచిది.బెర్రీస్ స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వాపు తగ్గించి మోకాళ్ల నొప్పి తగ్గిస్తాయి.
తృణధాన్యాలు బార్లీ, క్వినోవా, ఓట్స్, రైస్ లాంటి ధాన్యాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరంలోని మంట, వాపును తగ్గిస్తాయి. రోజువారీ ఆహారంలో ఇవి ఉండటం అవసరం.ఇలా ఈ ఆహారాలు తరచుగా తింటే మోకాళ్ల నొప్పి తగ్గి ఆరోగ్యం మెరుగవుతుంది. మరి ముఖ్యంగా యోగ చేయడం ద్వారా కూడా కీళ్ల సమస్యల నుంచి ఉపసపనం పొందవచ్చు.
ఈ సమాచారం కేవలం మీ అవగాహనకు మాత్రమే మీ ఆరోగ్య పరిస్థితి బట్టి ముందుగా మీ డాక్టర్ ని సంప్రదించవలెను