ఏపీ క్యాబినెట్ సమావేశం... వివిధ శాఖల్లో కీలక తీర్మానాలు, నిర్ణయాలు ఇవే!

తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు భయాందోళన సృష్టించాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, సినీ నటి త్రిష నివాసాలు.. అలాగే రాజ్‌భవన్, బీజేపీ కార్యాలయాలకు అజ్ఞాత వ్యక్తుల నుండి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.

కేవలం రూ.10,499 మాత్రమే.. 5000mAh బ్యాటరీ, 64 ఎంపీ కెమెరాతో "లావా బోల్డ్" 5జీ! ఫీచర్స్ చూస్తే షాకే!


సమాచారం అందిన వెంటనే బాంబ్ డిస్పోసల్ బృందాలు, స్నిఫర్ డాగ్స్ సంఘటనా స్థలాలకు చేరుకుని విస్తృతంగా తనిఖీలు జరిపాయి. ఎక్కడా పేలుడు పదార్థాలు కనుగొనబడకపోవడంతో అవి తప్పుడు బెదిరింపులేనని తేల్చారు. అయినప్పటికీ అల్వార్‌పేటలోని ముఖ్యమంత్రి నివాసం, రాజ్‌భవన్ చుట్టూ భద్రతా వలయాలు పెంచి హై అలర్ట్ లో ఉంచారు. కాల్స్ మూలాలను గుర్తించడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Second hand vehicles: పాత వాహనం కొంటే జాగ్రత్త..! రికార్డులు సరిచూడకపోతే కేసుల్లో ఇరుక్కోవాల్సిందే..!

కాగా గతంలో సైతం సీఎం స్టాలిన్, హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మళ్లీ ఇప్పుడు మరోసారి ఈ తరహా లోనే బెదిరింపులు రావడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ వరుస ఫేక్ ఘటనలతో తమిళనాడులో పెద్ద సెన్సేషన్‌గా మారాయి. ఈ విధమైన కాల్స్ ప్రజల భద్రతా వ్యవస్థలపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా భవిష్యత్తులో నిజమైన ప్రమాదాలను నిర్లక్ష్యం చేసే పరిస్థితి రాకూడదని హెచ్చరిస్తున్నారు.

SBI Car Loans: ఎస్బీఐ బంపరాఫర్! ఇప్పుడు బైక్ ఈఎంఐ తో కారు కొనేయండి!


ముఖ్యమంత్రి స్టాలిన్‌కు Z-ప్లస్ భద్రత ఉన్నప్పటికీ.. వరుసగా రెండో సారి కూడా ఇలా కాల్స్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఉద్దేశ్యపూర్వకంగా గందరగోళం సృష్టించడమే సదరు కాల్స్ చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ తరహా వారిని త్వరగా అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధిస్తే భవిష్యత్తులో మళ్లీ ఇలాంటివి రిపీట్ అవ్వవని అంటున్నారు.

Maruti Ertiga 2025: బెస్ట్ సెల్లింగ్ కార్లు.. స్టైలిష్ లుక్, లగ్జరీ ఇంటీరియర్స్ & బడ్జెట్-ఫ్రెండ్లీ!

ఇక వేర్వేరు ఈ-మెయిల్ ఐడీల ద్వారా బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసులు స్పష్టం చేశారు. సదరు మెయిల్ ఐడీల వివరాలు సేకరించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు. అయితే ఐపీ అడ్రస్ లు మారుస్తున్న తరుణంలో నిందితులను గుర్తించడం కష్టంగా మారిందని అంటున్నారు. ఈ వరుస ఘటనల నేపధ్యంలో ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. మరి రానున్న రోజుల్లో అయిన వీటికి బ్రేక్ పడుతుందేమో చూడాలి.

వంశధార, నాగావళి నదుల వద్ద తీవ్రంగా మారిన వరద ఉధృతి! అప్రమత్తంగా ఉండాలని సూచన!
Infinix Mobiles: ఇన్‌ఫినిక్స్ 5G బడ్జెట్ ఫోను! 500MP కెమెరా .. 7000mAh బ్యాటరీతో రూ.10 వేలకే మీ సొంతం!
AP Investors: విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ.. పారిస్ లో రోడ్ షో!
Archery Premier League: భారత్‌లో కొత్త చరిత్ర! ఆర్చరీ లీగ్-2025 ప్రారంభించిన మెగా పవర్ స్టార్!
Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! తగ్గిన బంగారం ధరలు!