Tollywood: టాలీవుడ్ యంగ్ హీరో‌పై మరో కేసు నమోదు.. మరీ ఇంత దారుణమా?

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (UPSC) కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 84 పోస్టులు భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. వీటిలో లెక్చరర్ పోస్టులు వృక్షశాస్త్రం, రసాయనశాస్త్రం, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, గృహశాస్త్రం, భౌతిక శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం, సామాజిక శాస్త్రం, జంతుశాస్త్రం వంటి సబ్జెక్టుల్లో ఉన్నాయి. అలాగే **పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాలకు ఎంపికైన వారు నేరుగా సీబీఐ (CBI)**లో పనిచేయాల్సి ఉంటుంది.

LIC భారీ నోటిఫికేషన్‌..! డిగ్రీ అర్హతతో 841 పోస్టుల భర్తీ! దరఖాస్తు గడువు దగ్గరలోనే!

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగానికి అనుగుణంగా బీఈడీ, ఎల్‌ఎల్‌బీ, ఎంఏ, ఎంఎస్సీ వంటి అర్హతలతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి గరిష్టంగా 45 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న వారు సెప్టెంబర్ 11, 2025లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నియామకాల్లో ఎలాంటి రాతపరీక్ష ఉండదు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

10 Medical colleges: రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలు.. ఎక్కడంటే!

జీతభత్యాల విషయానికి వస్తే.. లెక్చరర్ పోస్టులకు నెలకు రూ.52,700–1,66,700, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు రూ.56,100–1,77,500, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు రూ.44,900–1,42,400 మధ్య జీతం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంచి అవకాశమని అధికారులు తెలిపారు.

Modi Speech: మోదీ, సింగపూర్ ప్రధాని భేటీ.. భారత్ - సింగపూర్ సంబంధాలపై కీలక నిర్ణయాలు!
Health insurance: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..! 1.63 కోట్ల కుటుంబాలకు ఉచిత చికిత్సలు..! యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలు!
Ration Supply: కొత్త రేషన్ కార్డులు వచ్చిన వారికి అలర్ట్! వెంటనే ఈ పని చేయండి, లేదంటే రేషన్ ఇవ్వరు!
DJ Sound: డీజే సౌండ్ మళ్లీ బలి తీసుకుంది.. విషాదంలో గ్రామం!
Drunk teacher: మత్తులో మునిగిపోయిన గురువు.. పాఠశాల గౌరవానికి చెడ్డపేరు!
AP Govt: మాజీ ఎమ్మెల్యేకు త్వరలో కీలక పదవి! త్యాగానికి దక్కిన తొలి గుర్తింపు ఇదేనా?
GST Updates: సామాన్యులకు జీఎస్‌టీ గుడ్‌న్యూస్ దీపావళి కాదు... దసరాకే ఈ వస్తువుల ధరలు తగ్గనున్నాయి!