డార్లింగ్ ప్రభాస్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇప్పటికే పలు చిత్రాలలో షూటింగ్ పూర్తి చేసుకొని మరొకని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇటీవల విడుదలైన ది రాజా సాబ్ ట్రైలర్ చూస్తేనే గూస్ బంప్స్ వచ్చాయని చెప్పుకోవాలి ఆ డైలాగ్ డెలివరీ ప్రేక్షకులకు ఆ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. అయితే డార్లింగ్ మరో చిత్రం గురించి అప్డేట్ వచ్చేసిందోచ్.
హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ .లో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే దాదాపు 60 శాతం చిత్రీకరణ పూర్తయిందని, 2026 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా విడుదల చేయాలనే ఆలోచనలో బృందం ఉందని సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రం రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ బ్రిటీష్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారని టాక్. యుద్ధం, త్యాగం, ప్రేమ, దేశభక్తి వంటి భావాలు ఈ కథలో ప్రధానాంశాలుగా ఉండబోతున్నాయి. ప్రతి ఫ్రేమ్ దేశం కోసం పోరాడిన వీరుల గౌరవాన్ని ప్రతిబింబించేలా డిజైన్ చేస్తున్నారట.
ఈ చిత్రంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఫౌజీ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. సీతా రామం సినిమాకు ఆయన అందించిన సంగీతం ఇప్పటికీ ఆ పాటలను ప్రేక్షకు మరువలేరనే చెప్పుకోవాలి.
రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ది రాజాసాబ్, సలార్ 2 స్పిరిట్ కల్కి 2 వంటి పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజాసాబ్’ 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ప్రతి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్నారు. అలాంటి సమయంలో దేశభక్తి తాలూకు కథాంశంతో తెరకెక్కుతున్న ఫౌజీ ఆయన కెరీర్‌లో ఒక గోల్డెన్ చాప్టర్‌గా నిలవడం ఖాయం.