Passenger Halt: అరకు పర్యాటకులకు సూపర్ న్యూస్! ఇక అక్కడ కూడా రైళ్లు ఆగుతాయి... ఎంపీ సూచనపై రైల్వే మంత్రి గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పర్యాటక, వాణిజ్య రంగాల అభివృద్ధికి మరో ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంది. విశాఖపట్నంలో 13.74 ఎకరాల భూమిపై రూ.1,066 కోట్ల వ్యయంతో లులు మెగా షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడానికి సవరించిన అద్దె నిబంధనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మాల్‌ ద్వారా సుమారు 500 మందికి ఉపాధి లభించనుంది. వార్షిక లీజు అద్దె రూ.7.08 కోట్లుగా నిర్ణయించగా, ప్రతి పదేళ్లకోసారి 10 శాతం పెంపు ఉంటుంది.

APPSC Alert: పలు శాఖల ఉద్యోగాల రాత పరీక్ష ఫలితాలు విడుదల..! ఎంపిక జాబితా వెబ్‌సైట్‌లో..!

ఇక విజయవాడ మల్లవల్లి పారిశ్రామిక పార్కులో లులు సంస్థ కోర్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. దీనికి 7.48 ఎకరాల భూమిని 66 ఏళ్లకు లీజుకు కేటాయించేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంవత్సరానికి రూ.50 లక్షలు లీజు చెల్లించాలి. ఐదేళ్లకోసారి 5 శాతం అద్దె పెంపు నిబంధన అమల్లో ఉంటుంది. ఈ రెండు ప్రాజెక్టులు రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించనున్నాయి.

RTO Notice : వైట్ బోర్డు వాహనాలకు కొత్త RTO నోటీసులు! RC రద్దు, లైసెన్స్ సస్పెన్షన్!

అదే క్రమంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం పలు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం రూ.1,628.80 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రవ్యాప్తంగా పలు హోటల్, రిసార్ట్ ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. వీటి ద్వారా సుమారు 4,398 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. అమరావతిలో సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ రూ.176.96 కోట్లతో నాలుగు స్టార్ హోటల్ నిర్మించనుంది. శ్రీశైలంలో శ్రీ వేంకటేశ్వర లాడ్జ్ రూ.83 కోట్ల పెట్టుబడితో మూడు స్టార్ హోటల్ ఏర్పాటు చేయనుంది. అలాగే, అమరావతిలోనే దసపల్లా హోటల్స్ రూ.200 కోట్లతో మరో నాలుగు స్టార్ హోటల్ నిర్మించనుంది.

Trains: రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక..! మూడో లైన్ పనులతో 18వ తేదీ వరకు రైళ్ల రాకపోకల్లో అంతరాయం..!

అరకు వ్యాలీలో గిరిజన వ్యాపారవేత్త ముందడుగు వేసి రూ.55.84 కోట్ల వ్యయంతో లగ్జరీ రిసార్ట్ నిర్మిస్తున్నారు. ఇది గిరిజన సమాజానికి ప్రేరణగా నిలుస్తుందని ప్రభుత్వం పేర్కొంది. అలాగే విశాఖపట్నంలోని కొత్తవలస వద్ద మైరా బే వ్యూ రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్ సెంటర్ అభివృద్ధికి రూ.255.91 కోట్ల పెట్టుబడితో ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం మరో కొత్త శకానికి నాంది పలుకుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రం పెట్టుబడిదారులకు సురక్షితమైన, ప్రోత్సాహక వాతావరణం కల్పిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Ceasefire: కాల్పుల విరమణ అమల్లోకి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి.. గాజాలో శాంతి కాంతి!
పనితీరు మార్చండి.. ఉత్తరాంధ్ర మంత్రులకు సీఎం తీవ్ర హెచ్చరిక!!
బెల్లం టీ తాగడం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు!!
Bullet Train: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తోంది.. ఈ 12 స్టేషన్ల మధ్య! గంటకు 320 కి. మీ. వేగంతో..
Nara Bhuvaneswari: ప్రజాసేవకు ప్రతిష్టాత్మక గుర్తింపు! ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్‌పర్సన్ భువనేశ్వరికి గ్లోబల్ అవార్డు!
Egg Yolk: కోడిగుడ్లలో పచ్చని సొన తినాలా.. వ‌ద్దా! నిపుణులు ఏం చెప్తున్నారంటే!