ఆంధ్రప్రదేశ్‌కు అక్టోబర్ 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక పర్యటనకు రానున్నారు. ఈ సందర్బంగా ఆయన శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని దర్శించనున్నారు. పవిత్రత, సహజ సౌందర్యంతో ప్రసిద్ధి చెందిన శ్రీశైలం యాత్రకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది.
ప్రధాని హెలికాప్టర్ ద్వారా శ్రీశైలానికి చేరుకుని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తరువాత కొంత సమయం గుడిలో గడిపి, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి రోడ్ షోలో పాల్గొననున్నారు.
కర్నూలు పట్టణంలో నిర్వహించబోయే రోడ్ షో ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో మోదీ, చంద్రబాబు ఇద్దరూ కలిసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లను ప్రభుత్వం కట్టుదిట్టంగా చేపడుతోంది.
తరువాతి కార్యక్రమంలో ప్రధాని, ముఖ్యమంత్రితో కలిసి రాష్ట్ర పెట్టుబడులు, అభివృద్ధి అంశాలపై చర్చించనున్నారు. అలాగే కూటమి నాయకులు కూడా మోదీని కలుసుకుని భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ పర్యటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం లభించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.