Smart Highway: రెండు రాష్ట్రాల మధ్య... డిజిటల్‌ సాంకేతికతతో హై సెక్యూరిటీ హైవే! ప్రతి కిలోమీటర్‌కు ఏఐ కెమెరా!

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్‌ తూర్పు ఆగ్నేయ తీరాలను దిశగా కదిలి, తీవ్ర వాయుగుండా మారుతోంది. అమెరికాకు చెందిన జాయింట్‌ టైఫూన్‌ వార్నింగ్‌ సెంటర్‌ ప్రకారం, ఇది ఆదివారం రాత్రికి పూర్తిగా తుఫానుగా బలపడి, కోస్తాపై ముఖ్యంగా ప్రభావం చూపనుంది. భారత వాతావరణ శాఖ (IMD) ఈ తుఫాన్‌ ప్రభావాన్ని ఆదివారం అర్ధరాత్రి వరకు అధికారికంగా నిర్ధారించలేదు, అయితే ఇప్పటికే కోస్తాంధ్రం, విశాఖపట్నం మరియు కాకినాడ తీరాలపై గాలి వేగం 60–100 కిమీ/గంట ఉండే అవకాశం ఉంది.

SBI Jobs: ఎస్‌బీఐలో భారీ నియామకాలు! దేశవ్యాప్తంగా 3,500 పీఓ పోస్టులు భర్తీ!

తుఫాన్‌ కారణంగా కోస్తా ప్రాంతాల్లో కుంభవృష్టి, భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. మత్స్యకారులకు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న వారు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించారు. విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు ఉన్న ఓడరేవుల్లో అత్యధిక ప్రమాద హెచ్చరికలు ఇచ్చారు. రాష్ట్రంలో అనేక చోట్ల ఆదివారం వర్షాలు కురిసాయి.

బంగారం ధరలు షాక్! 24, 22 క్యారెట్ ధరల్లో ఊహించని మార్పు నేడు తెలుసుకోండి!!

విపత్తు ప్రభావం కారణంగా పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, ఉభయగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం, కడప జిల్లాల్లో పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలు రెండు–మూడు రోజులు మూతపడ్డాయి. ఈ సందర్భంగా డిప్లొమా సప్లిమెంటరీ పరీక్షలను కూడా వాయిదా వేయడం జరిగింది.

Revenue Department: భూ కేటాయింపుల్లో కొత్త విధానం.. ఇక నుంచి వాటికి మాత్రమే! రెవెన్యూ శాఖ గ్రీన్ సిగ్నల్!

విపత్తుల నిర్వహణ చర్యలకు ప్రభుత్వం 19 కోట్లు విడుదల చేసింది. దీనిలోని నిధులను జిల్లా కలెక్టర్లు తక్షణం వినియోగించుకునేలా అనుమతించారు. బాధితులను సహాయశిబిరాలకు తరలించడం, రక్షిత తాగునీరు, ఆహారం, వైద్య సేవలు అందించడం, రోడ్లు మరియు ఇతర అత్యవసర సేవలకు ఈ నిధులు వినియోగించబడతాయి. 9 ఎస్‌డీఆర్‌ఎఫ్‌, 7 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు తీర ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచబడ్డాయి.

District Reorganization: ఆ నియోజకవర్గాల విలీనంపై ప్రభుత్వం మళ్లీ దృష్టి! కృష్ణా జిల్లాలోకి చేర్చే యోచన!

తుఫాన్‌ వల్ల రాబోయే 48 గంటల్లో పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, తీరాల వద్ద గంటకు 90–110 కిమీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా కాకినాడ-తుని మధ్య తీరంలో తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు, వ్యవసాయ కార్మికులు, మత్స్యకారులు మరియు పర్యాటకులు సురక్షితంగా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తక్కువ ధరలో మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్‌తో ప్రీమియం లుక్! 1000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో - డేటా సేఫ్‌గా ఉండాలంటే!
Bhagavad Gita: హితకరమైన కోరికలతో జీవిస్తే ఫలితం తప్పదు.. గీతా సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -44!
మొంథా తుపాను ప్రభావం.. పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!
Cyclone: తుపాన్ ప్రభావం.. నిర్మలా సీతారామన్ పర్యటన వాయిదా.. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో!
రూ.1,48,200 జీతంతో AIIMSలో ఉద్యోగాలు.. ఈరోజే లాస్ట్ డేట్ !
Suryalanka Nizampatnam : తుపాన్ ప్రభావం తీవ్రం.. సూర్యలంక నిజాంపట్నం బీచ్లు తాత్కాలికంగా మూసివేత!