అంతర్జాతీయ మార్కెట్‌లో స్థిరత్వం కొనసాగుతున్న నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరల్లో పెద్ద మార్పు కనిపించలేదు. ఈ రోజు భారతదేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం గ్రాము ధర ₹12,561గా, 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర ₹11,514గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే ప్రతి క్యారెట్‌పై గ్రాముకు సుమారు ₹10 చొప్పున తగ్గుదల చోటుచేసుకుంది.
పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹1,25,610గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర ₹1,15,140గా ఉంది. అలాగే 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర ₹9,442, పది గ్రాములకు ₹94,420గా నమోదైంది. వెండి ధర మాత్రం స్వల్ప మార్పులతో కిలోకు ₹1,54,900గా కొనసాగుతోంది.
స్టాక్ మార్కెట్లలో కూడా సెన్సెక్స్ 84,211.88 పాయింట్ల వద్ద 0.41% తగ్గగా, నిప్టీ 25,795.15 పాయింట్ల వద్ద 0.37% వద్ద ట్రేడవుతున్నాయి.
బంగారం వ్యాపారానికి ముఖ్య కేంద్రంగా ఉన్న విజయవాడలో కూడా స్వల్ప మార్పులు నమోదయ్యాయి. నేడు (అక్టోబర్ 27) గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర ₹12,561గా ఉండగా, నిన్నటి ₹12,562తో పోలిస్తే రూ.1 తేడా కనిపించింది. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర ₹11,514గా, 18 క్యారెట్ల ధర ₹9,421గా నమోదైంది.
స్థానిక బులియన్ అసోసియేషన్లు నిర్ణయించిన ప్రకారం ప్రతి నగరంలో ధరల్లో స్వల్ప తేడాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, ప్రొద్దుటూరు ప్రధాన బంగారు మార్కెట్లుగా ఉండగా, దేశవ్యాప్తంగా ముంబై బంగారం వ్యాపారానికి కేంద్రంగా ఉంది.
ప్రముఖ నగరాల బంగారం ధరలు గ్రాముకు ఇలా ఉన్నాయి –
చెన్నై – 24 క్యారెట్ ₹12,544, 22 క్యారెట్ ₹11,499
ముంబై – 24 క్యారెట్ ₹12,561, 22 క్యారెట్ ₹11,514
ఢిల్లీ – 24 క్యారెట్ ₹12,576, 22 క్యారెట్ ₹11,529
కోల్‌కతా – 24 క్యారెట్ ₹12,561, 22 క్యారెట్ ₹11,514
బెంగళూరు – 24 క్యారెట్ ₹12,561, 22 క్యారెట్ ₹11,514
హైదరాబాద్ – 24 క్యారెట్ ₹12,561, 22 క్యారెట్ ₹11,514
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, డాలర్ మార్పిడి విలువల ప్రభావం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. పెట్టుబడిదారులు ఇప్పటికీ బంగారాన్ని ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కలిగించే సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తున్నారు