కుట్ర ఫెయిల్..
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ తమ అభ్యర్థులను పోటికి దించలేదు. పోటీచేసినా ఓడిపోతామనే ఉద్దేశంతో వైసీపీ ఎన్నికలకు దూరంగా ఉండి ఉండొచ్చనే ప్రచారం జరిగింది. కానీ వైసీపీ పోటీ చేయకపోవడానికి మరో అసలు కారణం ఉన్నట్లు తెలుస్తోంది. పీడీఎఫ్ అభ్యర్థులు ఎలాగూ పోటీ చేస్తారు. వైసీపీ అభ్యర్థిని పెడితే ఓట్లు చీలి టీడీపీకి ప్లస్ అవుతాయనే ఉద్దేశంతో తాము పీడీఎఫ్ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తే కూటమి అభ్యర్థులను ఓడించవచ్చనే ప్లాన్‌తో జగన్ తమ పార్టీ అభ్యర్థులను పోటీకి పెట్టలేదనే ప్రచారం జరుగుతోంది. తీరా ఫలితాలు చూసిన తర్వాత తమ నేతల ప్లాన్ పూర్తిగా విఫలమైందని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయట. ప్రభుత్వంపై వైసీపీ ఎంత విష ప్రచారం చేసినా, ప్రజలు మాత్రం ప్రభుత్వానికి తాము మద్దతుగా ఉంటామనే బలమైన సంకేతాన్ని ఎమ్మెల్సీ ఫలిత ద్వారా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు!
వైసీపీలో వణుకు
సూపర్ సిక్స్ హామీల అమలులో కొంత ఆలస్యం జరిగినా సరే.. రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దష్ట్యా తాము కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటామని ఎమ్మెల్సీ ఫలితాల ద్వారా చదువుకున్న యువత స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైందట. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కూడా తమకు గడ్డు పరిస్థితులు తప్పవని, వైసీపీని నమ్ముకుంటే రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఆందోళనలో కొందరు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితం తర్వాత ప్రభుత్వంపై ఉపాధ్యాయులు అసంతృప్తితో ఉన్నారంటూ వైసీపీ తమ అనుకూల మీడియాతో పాటు సోషల్ మీడయాలో ప్రచార ఊదరగొట్టింది. ఇదే సమయంలో వైసీపీ పరోక్షంగా సహకరించిన పీడీఎఫ్ అభ్యర్థ మూడో స్థానానికి పరిమితమయ్యారనే సత్యాన్ని వైసీపీ మర్చిపోయింది. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ మద్దతు తెలిపిన అభ్యర్థి విజయం సాధించిన విషయాన్ని వైసీపీ దాచిపెట్టింది. మరుసటి రోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు వెల్లడైన తర్వాత వైసీపీ నేతలంతా సైలెంట్ అయిపోయారనే చర్చ జరుగుతోంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!
నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..
మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందా? లేదా?
బోరుగడ్డ అనిల్ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుంది, ఆ ఛాన్స్ లేదు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: