బోరుగడ్డ అనిల్ ఎక్కడ ఉన్నారు. ఏమయ్యారు. పలు కేసుల్లో ఉన్న బోరుగడ్డ అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. తల్లి అనారోగ్యం కారణాలతో బోరుగడ్డకు గత నెల 15న బెయిల్ మంజూరైంది. ఇక, రాజమండ్రి జైలు నుంచి బోరుగడ్డ విడుదల అయ్యారు. తల్లికి చెన్నై అపోలోలో చికిత్స చేయించా లని గుంటూరు డాక్టర్ పేరుతో సర్టిఫికెట్ సమర్పించారు. దీంతో, ఈనెల 11వరకు బెయిల్ పొడి గింపు లభించింది. అయితే.. బోరుగడ్డ సమర్పించిన సర్టిఫికెట్ ఫేక్ గా గుర్తించారు. బోరుగడ్డ అనిల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావటంతో.. ఇప్పుడు బోరుగడ్డ ఎస్కేప్ వ్యవహారం సంచలనంగా మారింది.
బెయిల్ పైన బోరుగడ్డ
కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత బోరుగడ్డ అనిల్ కుమార్ ను గత అక్టోబర్ లో పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. బోరుగడ్డ పైన అనేక కేసులు నమోదయ్యాయి. కాగా, పలు కేసుల్లో బెయిలు వచ్చినప్పటికీ... అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో మాత్రం బెయిల్ రాలేదు. తన తల్లి పద్మావతికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని.. చికిత్స చేయించేందుకు వీలుగా బెయిల్ మంజూరు చేయాల ని కోరుతూ గత నెల 14న బోరుగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, న్యాయస్థానం ఫిబ్రవరి 15 నుంచి 28వరకు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. 28వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోవాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు బోరుగడ్డ అనిల్ బెయిలు గడువు ముగియగానే జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోయారు.
ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!
నకిలీ సర్టిఫికెట్
ఆ తరువాత తన తల్లి ఆరోగ్యం క్షీణించిందని, చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయించాలని, మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని ఈనెల 1వ తేదీన అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. తన తల్లికి అత్యవసరంగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించాలని గుంటూరు లలిత సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పీవీ రాఘవశర్మ మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చారని పేర్కొంటూ.. ఆ సర్టిఫికెట్‌ను ఆయన తరఫు న్యాయవాది కోర్టు ముందు ఉంచారు. ప్రస్తుతం ఆమె చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. కాగా, కోర్టుకు సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ నిజమై నదో, కాదో అనే సమాచారం తనకు లేదని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పష్టం చేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బోరుగడ్డ ఎస్కేప్
ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి మెడికల్ సర్టిఫికెట్ వాస్తవికతను పరిశీలించేం దుకు ప్రాసిక్యూషన్‌కు అనుమతించారు. తప్పుడు ధ్రువపత్రం అని తేలితే తగిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5వరకు మధ్యంతర బెయిల్ పొడిగి స్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కాగా, బోరుగడ్డ సమర్పించిన డాక్టర్ సర్టిఫికెట్ పైన పోలీసులు విచారణ చేసారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం బయటపడింది. గుంటూరు లలితా ఆస్పత్రిలో అనిల్ తల్లి పద్మావతి అసలు చేరనేలేదని...ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదని వెల్లడైంది. దీంతో, బోరుగడ్డ అనిల్ కోసం పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అనిల్‌తోపాటు ఆయన తల్లి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోందని సమాచారం. దీంతో, 11వ తేదీన బోరుగడ్డ తిరిగి వస్తారా రారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి వరుస షాక్ లు.. వంశీ నుంచి మరింత సమాచారం.. బెయిల్ ఇవ్వొద్దు.!
30 ఏళ్ల తర్వాత ఆసక్తికర దృశ్యం.. వెంకయ్యనాయుడులో పవర్, పంచ్‌లు తగ్గలేదు! మా రెండో అబ్బాయికి..
మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..
వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!
మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: