ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ఈరోజు తాను దత్తత తీసుకున్న కృష్ణా జిల్లా కొమరువోలు గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ... తనను మేడమ్ అని పిలవొద్దని, నేను మీ భువనమ్మను అని చెప్పారు. కొమరవోలుకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. కొమరవోలును తాను ఎప్పుడూ మర్చిపోనని భువనేశ్వరి చెప్పారు. గ్రామస్తులందరూ ఒక కుటుంబం మాదిరి కలిసి ఉండాలని అన్నారు. అందరం కలిసి గ్రామానికి మంచి చేసుకుందామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామంలో కనీసం రోడ్ల మరమ్మతు కూడా జరగలేదని అన్నారు. పామర్రు ఎమ్మెల్యే కుమార్ రాజా మాట్లాడుతూ... దత్తత తీసుకున్న తర్వాత గ్రామాన్ని భువనమ్మ ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు. కొమరువోలు ప్రజలు భువనమ్మ సేవలను తరతరాలుగా గుర్తుంచుకుంటారని చెప్పారు. గ్రామస్తుల తరపున భువనమ్మకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు.

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందా? లేదా?

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలు, ఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుంది, ఆ ఛాన్స్ లేదు!

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group