LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Nuzvid News: నూజివీడులో వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ...బీసీల రక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది - మంత్రి సవిత

Vadde Obanna Statue Inauguration: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతిరోజూ పండుగేనని మంత్రి సవిత అన్నారు. నూజివీడులో వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆమె, బీసీ రక్షణ చట్టం అమలు, ఎంఎస్ఎంఈ పార్కుల్లో ప్రాధాన్యత వడ్డెరల సమస్యలపై కీలక వ్యాఖ్యలు చే…

AndhraPravasi News Desk 2 min read
Nuzvid News: నూజివీడులో వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ...బీసీల రక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది - మంత్రి సవిత

Nuzvid News: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సామాన్యుల జీవితాల్లో  పండుగ వాతావరణం నెలకొందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ఏలూరు జిల్లా నూజివీడులో స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన  బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి ఆర్థిక, రాజకీయ ఎదుగుదలకు తెలుగుదేశం పార్టీయే అసలైన వేదిక అని మంత్రి స్పష్టం చేశారు.

బ్రిటీష్ పాలకులకు ఎదురు నిలిచి పోరాడిన వడ్డే ఓబన్న ధైర్యసాహసాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమని మంత్రి కొనియాడారు. ఓబన్న త్యాగాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన జయంతిని అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించారని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే ఓబన్న జయంతి వేడుకలను గత ఏడాది గుంటూరులో, ఈ ఏడాది అనంతపురంలో వైభవంగా నిర్వహించామని చెప్పారు. వడ్డెర సామాజిక వర్గానికి ప్రభుత్వం ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటుందని, వారిని ఎస్టీ జాబితాలో చేర్చే అంశాన్ని స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు.

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఇప్పటికే మెగా డీఎస్సీ నిర్వహించి రికార్డు సృష్టించామని సవిత పేర్కొన్నారు. ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయడం ద్వారా నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయని చెప్పారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తోందని, వీటిలో బీసీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తామని వెల్లడించారు. అలాగే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం వంటి వినూత్న పథకాలతో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతోందని ఆమె వివరించారు.

గత వైకాపా ప్రభుత్వంపై మంత్రి సవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ హయాంలో బీసీల హక్కులను పూర్తిగా కాలరాశారని, వడ్డెరలకు మైనింగ్ లీజుల్లో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేసి వారి పొట్ట కొట్టారని మండిపడ్డారు. జగన్ అధికార దాహంతో తన సొంత తల్లిని, చెల్లిని కూడా కోర్టులకు ఈడ్చారని, అలాంటి వ్యక్తికి ప్రజల సంక్షేమం పట్టదని విమర్శించారు. దానికి భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం మహిళల కోసం దీపం-2, స్త్రీ శక్తి, తల్లికి వందనం వంటి పథకాలను ప్రవేశపెట్టి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తోందని, బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావడానికి ముసాయిదా కూడా సిద్ధమైందని ఆమె తెలిపారు.

అంతకుముందు నూజివీడు చేరుకున్న మంత్రి సవితకు కూటమి నాయకులు, కార్యకర్తలు  ఆమెను ఘనంగా సత్కరించి, పట్టణంలో  ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎం. ఈశ్వరరావుతో పాటు పలువురు డైరెక్టర్లు, ఉమ్మడి కృష్ణా జిల్లా వడ్డెర సంఘం ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికీ చేరుతాయని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కూటమి లక్ష్యమని మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…