LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Nara Lokesh: 6నెలల్లో దొమ్మేటి విగ్రహాన్ని ఏర్పాటుచేస్తాం.. దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సభలో మంత్రి లోకేష్!

Nara Lokesh: శెట్టిబలిజల దైవం దివంగత దొమ్మేటి వెంకటరెడ్డి గారు. శెట్టిబలిజ సంక్షేమ సంఘం ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. శెట్టిబలిజల్లో చైతన్యం తీసుకొచ్చి హక్కుల సాధన కోసం ఉద్యమించారని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ కొనియాడారు.

AndhraPravasi News Desk 3 min read
Nara Lokesh: 6నెలల్లో దొమ్మేటి విగ్రహాన్ని ఏర్పాటుచేస్తాం.. దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సభలో మంత్రి లోకేష్!
  • గత వైసిపి పాలనలో బిసిలను వెంటపడి వేధించారు..
     
  • శెట్టిబలిజ కమ్యూనిటీ భవనాల నిర్మాణం చేపడతాం..

Nara Lokesh: శెట్టిబలిజల దైవం దివంగత దొమ్మేటి వెంకటరెడ్డి గారు. శెట్టిబలిజ సంక్షేమ సంఘం ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. శెట్టిబలిజల్లో చైతన్యం తీసుకొచ్చి హక్కుల సాధన కోసం ఉద్యమించారని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ కొనియాడారు. విశాఖపట్నం తెలుగుదేశం కార్యాలయంలో దివంగత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... శెట్టి బలిజల ఆత్మగౌరవం దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని ఈరోజు రాష్ట్ర పండుగగా జరుపు కుంటున్నాం. దొమ్మేటి వెంకటరెడ్డి జీవితం మనకు ఆదర్శం. 

బ్రిటిష్ పాలనలో శెట్టిబలిజలు బర్మా వలస వెళ్లారు. వారిలో దొమ్మెటి వెంకట రెడ్డి గారు కూడా ఉన్నారు. షిప్స్ అద్దెకు తీసుకొని షిప్పింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. సమర్ధవంతంగా వ్యాపారం చేసి షిప్స్‌కు ఓనర్ అయ్యారు. తర్వాత బర్మాకు మేయర్‌గా పనిచేశారు. శెట్టిబలిజలు బర్మాలో పడుతున్న బాధలు నేరుగా చూశారు. విద్య విలువ అప్పట్లోనే తెలుసుకొని పిల్లల కోసం స్కూళ్లు పెట్టారు. నైట్ స్కూళ్లు ఏర్పాటు చేశారు. బర్మాలో శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు. అక్కడ ఆర్థికంగా బలపడిన తర్వాత జన్మభూమికి సేవ చేయాలని నిర్ణయించుకుని జన్మభూమికి వచ్చారు. బోడసకుర్రు జమీందార్‌గా అనేక దానధర్మాలు చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. స్కూళ్లు, కళాశాలలు ఏర్పాటు కోసం దొమ్మేటి వెంకట రెడ్డి గారు తన సొంత భూమిని దానం చేశారు. లైబ్రరీలు స్టార్ట్ చేయడానికి నిధులు ఇచ్చారు.

యువగళం హామీని  బెట్టుకున్నా..
శెట్టిబలిజల సంక్షేమం కోసం 2014 నుంచి 2019 వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. కల్లుగీత ఫెడరేషన్, ఆదాయ పథకం, సబ్సిడీ లోన్లు ఇచ్చాం. కల్లుగీత కార్మికులను ఆదుకున్నాం. 2019–24 నడుమ  ఏమి జరిగిందో మీరంతా చూశారు. జె-బ్రాండ్స్‌తో కల్లుగీత కార్మికులను ఆర్థికంగా దెబ్బతీశారు. కల్లుగీత కార్మికులపై అనేక కేసులు పెట్టారు. మొన్న జరిగిన ఎన్నికల్లో మీరంతా ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా 94శాతం సీట్లతో కూటమి అభ్యర్థులను గెలిపించారు. ఈరోజు కార్యక్రమం యువగళం పాదయాత్రను  గుర్తుకుతెచ్చింది. అప్పట్లో ప్రతిరోజు ఒక సామాజిక వర్గాన్ని కలిశాను. దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని ప్రభుత్వ పండుగగా చేయాలని ఆనాడు శెట్టిబలిజ సోదరులు నన్ను కోరారు. ప్రజాప్రభుత్వం వచ్చాక ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. దొమ్మేటి వెంకటరెడ్డి గొప్పతనం పాదయాత్రలో తెలుసుకున్నా. యువగళం పాదయాత్ర సందర్భంగా 10శాతం మద్యం షాపులు శెట్టిబలిజలకు ఇస్తామని హామీ ఇచ్చా. ప్రభుత్వం వచ్చాక ఆ హామీ నెరవేర్చా.

వాళ్ళు వేధించారు... మేం ఆదరిస్తున్నాం
గతంలో ఆదరణ పథకంలో శెట్టిబలిజలకు పనిముట్లు అందజేశాం, వైసీపీ ప్రభుత్వం శెట్టిబలిజ సోదరులను తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపింది. తన అక్కని ఎందుకు వేధిస్తున్నావని అడిగినందుకు అమర్నాథ్ గౌడ్ అనే చిన్నపిల్లాడిని కొట్టి పెట్రోలు పోసి తగులబెట్టారు. బీసీ సోదరులపై ఇష్టారాజ్యంగా దాడులు చేశారు. అమర్నాథ్ గౌడ్ కేసులో నిందితుడిని ఊరేగించారు. గత ఐదేళ్లు బీసీ సోదరులను  రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. వారి నాయకుడికి జై చెప్పలేదని పల్నాడులో తోట చంద్రయ్యను కిరాతకంగా చంపేశారు. వారి బిడ్డకు మేం పదిరోజుల్లో ఉద్యోగం ఇస్తాం. ప్రొద్దుటూరులో వైసీపీ నేతలు హతమార్చిన నందం సుబ్బయ్య బిడ్డలను, అమర్నాథ్ గౌడ్ సోదరిని మేం చదివిస్తున్నాం. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అధిగమించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఇచ్చిన మాటను నిలుపుకునేందుకు చంద్రబాబు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఆయన స్పీడ్ ను మేం అందుకోలేక పోతున్నాం. శెట్టిబలిజలకు కమ్యూనిటీ భవనాల నిర్మాణం, చెట్టు పైనుంచి పడిన కార్మికులను ఆర్థికంగా ఆదుకునే బాధ్యత మాది.  బోడసకుర్రు బ్రిడ్జికి వెంకటరెడ్డి పేరు పెట్టే విషయమై సీఎంతో మాట్లాడతాం.

ఆరునెలల్లో వెంకటరెడ్డి విగ్రహం
ఆర్యవైశ్యుల మాదిరిగానే బోడసకుర్రులో దొమ్మేటి విగ్రహం కలిసికట్టుగా ఏర్పాటు చేస్తాం. ఇందుకు టీడీపీ తరపున, ప్రభుత్వం తరపున సాయం అందిస్తాం. అమరావతిలో పొట్టి శ్రీరాములు 58 అడుగులు విగ్రహం 194 రోజుల్లో పూర్తి చేశారు. అదే స్పూర్తితో ఆరునెలల్లో దొమ్మేటి విగ్రహం ఏర్పాటు చేయాలి. విగ్రహావిష్కరణకు సీఎం, ఉప ముఖ్యమంత్రి హాజరవుతారని లోకేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ ముతుకుమిల్లి భరత్, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, వెలగపూడి రామకృష్ణ బాబు, బండారు సత్యనారాయణమూర్తి, శెట్టిబలిజ కార్పోరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, టీడీపీ పాలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రమణ్యం, రెడ్డి అనంతకుమారి తదితరులు పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…