BCCI clear: మ్యాచ్‌ పై తగ్గుతున్న క్రేజ్ ఆడక తప్పదు.. బీసీసీఐ స్పష్టం!

ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో బాగా పేరు తెచ్చుకున్నది స్త్రీ శక్తి పథకం. దీనిలో భాగంగా మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు మధ్యతరగతి మహిళల జీవితాలను పూర్తిగా మార్చేసింది. 

CRDA Jobs: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. సీఆర్‌డీఏలో భారీగా ఉద్యోగాల భర్తీ! చివరి తేదీ ఎప్పుడు?

ఒకప్పుడు తీర్థయాత్రలకు, ముఖ్యమైన పనులకోసం బస్సు ఎక్కాలంటే చాలా ఆలోచించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మహిళలు తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి ఉత్సాహంగా పలు దేవాలయాలను చుట్టేస్తున్నారు. ఈ పథకం వల్ల వారి కళ్లలో కొత్త వెలుగు కనిపిస్తోంది.

Sports News: భారత ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీకా రావల్ సంచలనం.. వన్డే క్రికెట్‌లో వరల్డ్ రికార్డు!

మహిళల ఉచిత బస్సు ప్రయాణాల కారణంగా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలైన ద్వారకాతిరుమల, విజయవాడ, అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి వంటి క్షేత్రాల్లో రద్దీ పెరిగింది. మహిళలు దూరంగా ఉన్న ఆలయాలకే కాకుండా, తమకు దగ్గరలోని ఆలయాలను కూడా దర్శించుకుంటున్నారు. 

Modi Tweet: యానిమల్ లవర్స్‌పై ప్రధాని మోదీ.. ప్రజల భద్రత వర్సెస్ జంతు హక్కులు!

"ఎంత హాయిలే ఇలా" అంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల, మద్దిక్షేత్రం, వాడపల్లి, భీమవరం మావుళ్లమ్మ, పంచారామక్షేత్రాలు వంటి ఆలయాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు.

RGV: ఆర్జీవి వివాదాస్పద వ్యాఖ్యల నడుమ చిక్కుకున్న వైల్డ్ డాగ్ దర్శకుడు!

ఈ పథకం వల్ల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. బస్సులు అధిక శాతం మహిళలతోనే నిండిపోతున్నాయి. ఇది ఆర్టీసీకి కూడా మంచి విషయం. ఆక్యుపెన్సీ పెరిగింది కాబట్టి, ఆర్టీసీ ఆదాయం కూడా పెరుగుతుందని ఆశిస్తున్నారు. అధికారులు త్వరలోనే మరిన్ని కొత్త బస్సులు తీసుకొస్తామని, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు.

Airport: తెలంగాణలో ఒక్క విమానాశ్రయమే.. కానీ ఏపీలో ఎన్నో తెలుసా!

ద్వారకాతిరుమల ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అక్కడ ఉచిత భోజనం, ప్రసాద సౌకర్యం ఉండటం వల్ల మహిళల రద్దీ మరింత పెరిగింది. శనివారం, రెండో శనివారం కావడంతో భక్తులు మరింత ఎక్కువ వచ్చారు. దాదాపు 20 వేల మంది భక్తులు వచ్చి ఉంటారని అధికారులు అంచనా వేశారు. "శ్రీనివాసా గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా" అంటూ శ్రీవారి క్షేత్రం మార్మోగింది.

Hair Secret: చిన్న వయస్సులోనే తెల్ల జుట్టా! బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిన పని లేదు! ఇటు ఒక లుక్కేయండి!

ఈ పథకం వల్ల లబ్ధి పొందిన మహిళలు తమ అనుభవాలను పంచుకున్నారు. గుంటూరు నుంచి వచ్చిన ఒక భక్తురాలు మాట్లాడుతూ, "ఇంట్లో అందరం బయలుదేరినా బస్సు ప్రయాణంలో రూపాయి ఖర్చు కాలేదు. గుంటూరు నుంచి వచ్చి దైవ దర్శనం చేసుకున్నాం. బస్సులు రద్దీగా ఉన్నా ప్రయాణం సాఫీగానే సాగింది. ప్రభుత్వం పెట్టిన ఈ పథకం ఎంతో ఊరటగా ఉంది" అని అన్నారు.

Maruti suzuki SUV: 2025 లో లాంచ్ అవుతున్న ఎలెక్ట్రిక్ SUV! ఫీచర్స్ ఇవే!

మరో మహిళ మాట్లాడుతూ, "ద్వారకాతిరుమల ఆలయానికి వద్దామన్న మొక్కు కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. కానీ కుదరలేదు. ఇప్పుడు ఫ్రీ బస్సు ప్రయాణంతో కలిసి వచ్చింది. కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చాం. మొక్కులు తీర్చుకున్నాం, ఆనందంగా ఉంది" అని అన్నారు.

water can : వాటర్ క్యాన్ ఎంత కాలం వాడుతున్నారు.. మూడు నెలలకు మించితే! ఇక అంతే!

ఈ మాటలు వింటే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంత మంచిదో అర్థమవుతుంది. ఇది కేవలం ఒక ఉచిత పథకం మాత్రమే కాదు, చాలామంది మహిళల కలలను నెరవేరుస్తుంది. ఆర్థికంగా అండగా నిలిచి వారి ఆనందాన్ని పెంచుతుంది. ఈ పథకం వల్ల మహిళలు సురక్షితంగా, సులభంగా ప్రయాణించగలుగుతున్నారు. ఇది మహిళా సాధికారతకు ఒక మంచి ఉదాహరణ.

Amaravati Expressway: కేంద్రం గ్రీన్ సిగ్నల్! అమరావతి ఎక్స్ప్రెస్ హైవే... డీపీఆర్ రెడీ!
Scooters: పెట్రోల్ స్కూటర్ vs ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇందులో ఏది బెస్ట్? ఎంత తేడా ఉందో చూస్తే షాక్.!