LIVE
Assam: అస్సాంలో యుద్ధ విమానం ప్రమాదం.. ఐదుగురు వాయుసేన సిబ్బంది మృతి!  •  Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Business

LPG Shortage: ముంబయిలో గ్యాస్ మంటలు... సిలిండర్ల కొరతతో 20 శాతం హోటళ్లు బంద్!

LPG Shortage In Mumbai: వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ముంబయిలోని 20 శాతం హోటళ్లు మూతపడ్డాయి. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల వల్ల దిగుమతులకు ఆటంకం కలగడమే దీనికి ప్రధాన కారణం. కేంద్ర ప్రభుత్వం నిల్వలు ఉన్నాయని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో సరఫరా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బ్లాక…

AndhraPravasi News Desk 1 min read
LPG Shortage: ముంబయిలో గ్యాస్ మంటలు... సిలిండర్ల కొరతతో 20 శాతం హోటళ్లు బంద్!

వాణిజ్య సిలిండర్ల కొరత.. మెట్రో నగరాల్లో మూతపడుతున్న రెస్టారెంట్లు.

హోటల్ ఇండస్ట్రీకి ఎల్పీజీ షాక్.. ముంబయిలో సగం హోటళ్లు మూసివేసే ప్రమాదం?

గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందా.. నిఘా పెంచిన కేంద్ర ప్రభుత్వం…

LPG Shortage In Mumbai: దేశంలో వంట గ్యాస్ కొరత (LPG Shortage) ఆందోళన కలిగిస్తోంది. వాణిజ్య సిలిండర్ల సరఫరాలో అంతరాయం కలగడం వల్ల దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో దాదాపు 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. ఈ మేరకు ముంబయి హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ మంగళవారం వెల్లడించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే రెండు రోజుల్లో నగరంలోని సగం హోటళ్లు మూసివేయక తప్పదని అసోసియేషన్ హెచ్చరించింది.

కేవలం ముంబయిలోనే కాకుండా ఢిల్లీ, బెంగళూరు వంటి ఇతర మెట్రో నగరాల్లో కూడా వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. దీనివల్ల హోటల్ యజమానులు తమ వ్యాపారాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. ఇదే అదనుగా కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఎల్పీజీ బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుండి 25 రోజులకు పెంచడమే కాకుండా, సరఫరాను పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

భారతదేశం తన వార్షిక వంట గ్యాస్ అవసరాల్లో (సుమారు 31.3 మిలియన్ టన్నులు) 62 శాతాన్ని విదేశాల నుండే దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో చోటుచేసుకున్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా హార్మూజ్ జలసంధిని మూసివేయడం ఈ దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే, మన దేశంలో ప్రస్తుతానికి సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ప్రస్తుతానికి పెంచబోమని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Be the first to react

More Coverage

Gold Rate Today: ట్రంప్ వ్యాఖ్యలతో బులియన్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు.. భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు!

Gold Rate Today: ట్రంప్ వ్యాఖ్యలతో బులియన్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు.. భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు!

Gold Rate Today: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు సద్దుమణిగే సంకేతాలు వెలువడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బం…

Stock Market: అమెరికా-ఇరాన్ శాంతి సంకేతాలు... దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్.. దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు! ప్రపంచ మార్కెట్లలో కొత్త ఉత్సాహం..

Stock Market: అమెరికా-ఇరాన్ శాంతి సంకేతాలు... దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్.. దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు! ప్రపంచ మార్కెట్లలో కొత్త ఉత్సాహం..

Stock Market: అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరవచ్చనే సానుకూల సంకేతాలతో శుక్రవారం భారత స్టాక్ మ…