LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

AP IT News: గ్లోబల్ ఐటీ దిగ్గజం క్యాప్ జెమినీతో మంత్రి నారా లోకేష్ భేటీ.. విశాఖలో 20 వేల ఉద్యోగాలే లక్ష్యం!

AP IT News: విశాఖపట్నంలో ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్, GCC ఏర్పాటు చేయాలని క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్‌ను మంత్రి నారా లోకేష్ కోరారు. ఏపీలో 20 వేల ఉద్యోగాల కల్పన, ఏఐ, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యంపై జరిగిన ఈ కీలక భేటీ వివరాలు

AndhraPravasi News Desk 2 min read
AP IT News: గ్లోబల్ ఐటీ దిగ్గజం క్యాప్ జెమినీతో మంత్రి నారా లోకేష్ భేటీ.. విశాఖలో 20 వేల ఉద్యోగాలే లక్ష్యం!

AP IT News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా మార్చే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ 'క్యాప్ జెమినీ' సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో ఆయన కీలక భేటీ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ లో  భాగంగా విశాఖలో ఐటీ  డేటా సెంటర్ల ఏర్పాటుకు ఉన్న అపారమైన అవకాశాలను ఈ సందర్భంగా లోకేష్ వివరించారు. ఇప్పటికే గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ కంపెనీలు విశాఖలో అడుగుపెట్టాయని, త్వరలోనే భోగాపురం ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రానుండటంతో ఇక్కడ అద్భుతమైన ఎకో సిస్టమ్ ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.

విశాఖలో దాదాపు 20 వేల మందికి ఉపాధి కల్పించేలా ఒక భారీ డెవలప్‌మెంట్ సెంటర్‌తో పాటు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటు చేయాలని క్యాప్ జెమినీ సంస్థను లోకేష్ కోరారు. కేవలం ఐటీ సేవలకే పరిమితం కాకుండా క్లౌడ్ సర్వీసెస్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (BPM) వంటి విభాగాలను కూడా ఇక్కడ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని యువతకు అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని రకాల మౌలిక సదుపాయాలను  ప్రోత్సాహకాలను అందించేందుకు సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు.

సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ  డిజిటల్ టాలెంట్ డెవలప్‌మెంట్ వంటి అంశాల్లో ఏపీ విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయాలని లోకేష్ సూచించారు. రాష్ట్రంలో 'క్వాంటం వ్యాలీ' అభివృద్ధికి క్యాప్ జెమినీ సహకారం అందించాలని, క్వాంటం కంప్యూటింగ్ ద్వారా ఫైనాన్షియల్ సర్వీసెస్  ఆప్టిమైజేషన్ రంగాల్లో నూతన ఆవిష్కరణలు తీసుకురావాలని కోరారు. తద్వారా ఏపీ విద్యార్థులకు ప్రపంచస్థాయి టెక్నాలజీపై పట్టు వస్తుందని ఆయన ఆకాంక్షించారు.

ఈ భేటీలో క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్ మాట్లాడుతూ తమ సంస్థ కార్యకలాపాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా తమకున్న 3.4 లక్షల మంది ఉద్యోగుల్లో సుమారు 2 లక్షల మంది భారత్‌లోనే ఉండటం విశేషమని తెలిపారు. ప్రస్తుతం దేశంలోని 13 ప్రధాన నగరాల నుంచి సేవలు అందిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. క్లౌడ్, డేటా  డిజిటల్ ఇంజనీరింగ్ రంగాల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను తమ బృందం పరిశీలిస్తుందని చెప్పారు.

సుమారు 24 బిలియన్ డాలర్ల వార్షికాదాయం కలిగిన క్యాప్ జెమినీ వంటి సంస్థ విశాఖకు రావడం వల్ల ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారిపోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కీలక సమావేశంలో క్యాప్ జెమినీ ఇండియా సీఈవో సంజయ్ చాకేతో పాటు డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సీఈవో కేశవ్ మురుగేష్ కూడా పాల్గొని చర్చల్లో భాగస్వాములయ్యారు. ఐటీ రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టాలన్న పట్టుదలతో మంత్రి లోకేష్ చేస్తున్న ఈ ప్రయత్నాలు పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…