దేశవ్యాప్తంగా ఈరోజు బంగారం ధరలు కొంచెం తగ్గాయి. అక్టోబర్ 24వ తేదీ ఉదయం నాటికి విజయవాడలో 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర ₹12,507గా, 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర ₹11,464గా, 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర ₹9,380గా నమోదైంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు నమోదయ్యాయి.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ₹1,25,200, 22 క్యారెట్లు ₹1,14,750గా ఉన్నాయి.
ఢిల్లీలో 24 క్యారెట్లు ₹1,25,300, 22 క్యారెట్లు ₹1,14,850.
చెన్నైలో 24 క్యారెట్లు ₹1,25,050, 22 క్యారెట్లు ₹1,14,520.
బెంగళూరులో 24 క్యారెట్లు ₹1,25,100, 22 క్యారెట్లు ₹1,14,580గా ఉన్నాయి.
హైదరాబాద్‌లో 24 క్యారెట్లు ₹1,25,080, 22 క్యారెట్లు ₹1,14,650గా నమోదయ్యాయి.
విజయవాడలో 24 క్యారెట్లు ₹1,25,070, 22 క్యారెట్లు ₹1,14,640గా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ₹1,25,300, 22 క్యారెట్లు ₹1,14,850గా నమోదయ్యాయి. ఇది నిన్నటి కంటే సుమారు ₹700 తక్కువ. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం, బంగారం కొనుగోళ్లు తగ్గడం వంటి అంశాలు ఈ పతనానికి కారణమయ్యాయి.
ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో కిలో వెండి ధర ₹1,59,000గా ఉంది. దేశవ్యాప్తంగా గ్రాము వెండి ధర ₹173.90గా ఉండగా, విజయవాడలో కూడా అదే రేటు నమోదైంది.వెండి ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో కిలో వెండి ₹1,75,000 వద్ద కొనసాగుతోంది
అంతర్జాతీయ మార్కెట్లో కూడా స్వల్ప మార్పులు నమోదయ్యాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $86 పెరిగి $4,136కి చేరగా, స్పాట్ సిల్వర్ ధర 1.37 శాతం పెరిగి ఔన్సుకు $48.76కి చేరింది.
దేశీయ స్టాక్ మార్కెట్ నేడు మిశ్రమ ధోరణిని ప్రదర్శించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 81,159 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 24,890 పాయింట్ల వద్ద లాభాలతో కొనసాగాయి. ఆటోమొబైల్, బ్యాంకింగ్ రంగాల్లో లాభాలు నమోదవుతుండగా, ఐటీ రంగంలో కొద్దిగా ఒత్తిడి కనిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ధర లీటరుకు ₹109.38, డీజిల్ ధర ₹97.21 వద్ద కొనసాగుతున్నాయి.
బంగారం, వెండి ధరలు రోజువారీగా మారుతుంటాయి. ఉదయం ప్రకటించిన ధరలు సాయంత్రానికి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి పసిడి లేదా వెండి కొనుగోలు చేసేముందు స్థానిక జ్యువెలరీ షాపుల్లో తాజా రేట్లు తెలుసుకుని కొనుగోలు చేయడం మంచిది.