చాంపియన్స్ WCL లీగ్‌లో విండీస్‌పై విజయంతో భారత్ సెమీఫైనల్‌కి అర్హత సాధించింది. ఇప్పుడు అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సెమీఫైనల్ పోరు — భారత్ vs పాకిస్తాన్, రేపు (జులై 31) ఇంగ్లాండ్‌లోని ఎడ్జ్బస్టన్ మైదానంలో సాయంత్రం 5 గంటలకు (IST) జరగనుంది. కానీ, లీగ్ స్టేజ్‌లో భారత్ పాక్‌తో ఆడే మ్యాచ్‌ను భద్రతా కారణాల వల్ల బాయికాట్ చేయడం వల్ల, మ్యాచ్‌ను టోర్నమెంట్ మేనేజ్‌మెంట్ రద్దు చేసి, ఇరు జట్లకూ చెరో పాయింట్ కేటాయించింది.
ఇప్పుడు అదే పరిస్థితి సెమీఫైనల్‌కు కూడా వర్తిస్తే, భారత్ ఆడకపోతే ఆటోమేటిగ్గా పాక్ ఫైనల్‌కు చేరే అవకాశం ఉంది. దీనిపై అభిమానులు, విశ్లేషకులు, మీడియా విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు “క్రీడకు రాజకీయం కలపకూడదు” అనే వాదన ఉంటే, మరోవైపు జాతీయ సెక్యూరిటీ కీలకం అనే ఆందోళనలూ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో పాక్‌తో భారత్ ఆడాలా? వద్దా? అనే ప్రశ్నపై సామాజిక మాధ్యమాల్లో చర్చ ఊపందుకుంది. అభిమానుల స్పందనలు, అధికారిక ప్రకటనలు ఇంకా రావాల్సి ఉంది. అయితే ఇది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు, ఇది భావోద్వేగాలకు, జాతీయ గౌరవానికి సంబంధించి బలమైన పరిణామాలు కలిగించే అంశం.