Andhra Pradesh financial news: ఏపీకి ఆర్థిక ఊరట.. రూ.410 కోట్లు విడుదల – రైతులకు ప్రజలకు ఉపశమనం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశంపై హైకోర్టులో సోమవారం కీలక విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ్ శర్మల ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించింది. సమాజంలో ట్రాన్స్‌జెండర్లు ఇప్పటికీ వివక్షకు గురవుతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే ట్రాన్స్‌జెండర్లకు 1% రిజర్వేషన్ అమలులో ఉందని, ఆ విధానాన్ని పరిశీలించి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. విచారణను నాలుగు వారాల తరువాతకు వాయిదా వేసింది.

Shreyas released ICU : భారత జట్టుకు ఊరటనిచ్చే వార్త.. ICU నుంచి బయటకు వచ్చిన శ్రేయస్... ప్లీహమ్ రికవరీ వరకు!

ఈ కేసును ఎం.గంగాభవాని అనే ట్రాన్స్‌జెండర్ 2019లో దాఖలు చేశారు. 2018లో ఎస్సై పోస్టుల నియామక ప్రకటనలో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్ ఇవ్వలేదని ఆమె హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఆ నియామకాలు జరిగాయని పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు. గంగాభవాని పురుషుడిగా జన్మించి లింగమార్పిడి తర్వాత ట్రాన్స్‌జెండర్‌గా జీవిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దరఖాస్తులో పురుషుడు లేదా స్త్రీ అనే రెండు ఆప్షన్లు మాత్రమే ఉండటంతో, పిటిషనర్ తప్పనిసరిగా స్త్రీగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

Railway update: మొంథా తుపాన్ భీభత్సం.. రైల్వే అలర్ట్ జారీ ప్రయాణికులు జాగ్రత్త! ఆ జిల్లాల హెల్ప్‌డెస్క్ నంబర్లు రిలీజ్ చేసిన రైల్వే శాఖ!

ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన రాతపరీక్షలో గంగాభవాని 35% మార్కులు సాధించినప్పటికీ, ఆమెను అర్హురాలిగా పరిగణించలేదని లాయర్ వివరించారు. ఈ విషయంపై 2022లో హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆమె పిటిషన్‌ను కొట్టివేశారు. అనంతరం పిటిషనర్ ధర్మాసనంలో అప్పీల్‌ దాఖలు చేశారు. తాజా విచారణ సందర్భంగా హోంశాఖ ప్రధాన కార్యదర్శి కుమార్ విశ్వజీత్ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు.

AP Schools: ఒక్క గురువుతో 13 వేల బడులు..! విద్యార్థుల భవిష్యత్తు సస్పెన్స్‌లో..!

హోంశాఖ తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టులో వాదిస్తూ, గంగాభవానికి 28% మార్కులు మాత్రమే వచ్చాయని తెలిపారు. కనీస అర్హత 35% కావడంతోనే ఆమె అభ్యర్థన తిరస్కరించబడిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 2017లో ట్రాన్స్‌జెండర్లపై పాలసీ రూపొందించినా అది అమల్లోకి రాలేదని అంగీకరించారు. దీనిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “రిజర్వేషన్లు ఇవ్వకుండానే పాలసీ తీసుకురావడంలో ప్రయోజనం ఏమిటి?” అని ప్రశ్నించింది.

AP Transport authority : మొంథా తుఫాన్‌ దెబ్బకు ఆర్టీసీ అలర్ట్‌ – ఆ బస్సులు రద్దు, ప్రయాణికులకు కీలక సూచనలు!

కోర్టు చివరగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చర్యలు తీసుకోవాలని, కర్ణాటక మాదిరిగా ట్రాన్స్‌జెండర్ల రిజర్వేషన్ వ్యవస్థను పరిశీలించాలని ఆదేశించింది. ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేసే దిశగా ప్రభుత్వం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని న్యాయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Earthquake: మళ్లీ కంపించిన తుర్కియే..! రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం..!
Amazon: అమెజాన్‌లో మరోసారి భారీ లేఆఫ్స్‌..! 30 వేల మంది ఉద్యోగులకు ఎగ్జిట్‌ ఆర్డర్లు..!
International New : జపాన్‌ ప్రధాని ట్రంప్‌కి నోబెల్‌ మద్దతు.. తకైచి సంచలన ప్రకటనతో ఆసియా దేశాలు షాక్!
Montha Cyclone: మొంథా తుఫాను దెబ్బ..! విజయవాడ విమానాశ్రయంలో సర్వీసుల రద్దు..!
SBI: ప్రపంచ ఉత్తమ బ్యాంకుగా ఎస్‌బీఐకు డబుల్ అవార్డులు..! ప్రతిష్ఠాత్మక గ్లోబల్ గుర్తింపు..!