ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్నారై టీడీపీ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఆక్లాండ్‌లో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని టీడీపీ న్యూజిలాండ్ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ACT పార్టీ ఎంపీ డా. పరమ్జిత్ పర్మార్ గారు, హై కమిషన్ ఆఫ్ ఇండియా, న్యూజిలాండ్ తరపున వైస్ కాన్సల్ గారు హోన్. మనీష్ కుమార్, బిజినెస్‌మ్యాన్ మరియు ఆక్లాండ్ టిటిడి బోర్డు డైరెక్టర్ ఇంద్ర సిరిగిరి గారు, అలాగే న్యూజిలాండ్ తెలుగు సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు.
ప్రధాన అతిథులను టీడీపీ న్యూజిలాండ్ అధ్యక్షులు ఆదిశేషయ్య నల్లపనేని గారు, కొత్త టీడీపీ న్యూజిలాండ్ కమిటీ సభ్యులను పరిచయం చేశారు.
ఈ వేడుకలో చిన్నారులు అందించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించిన ఈ సాంస్కృతిక ప్రదర్శనలతో సభ ఉత్సాహంగా సాగింది. కార్యక్రమం అనంతరం రుచికరమైన విందు ఏర్పాటు చేయబడింది.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు టీడీపీ న్యూజిలాండ్ కమిటీ సభ్యులు మరియు స్వచ్ఛంద సేవకులు అభినందనీయులు.
ఆంధ్రుల ఐక్యతను, తెలుగు సంస్కృతిని నిలబెట్టే దిశగా ఇటువంటి కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తామని అధ్యక్షులు ఆదిశేషయ్య నల్లపనేని గారు తెలిపారు.