మాజీ సీఎం జగన్ వల్ల ఎంతో మంది జైలుకు వెళ్లారని.. వాళ్లని పరామర్శించకుండా నెల్లూరుకు ఎందుకు వస్తున్నారని మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అంత మంచివాడా? అని ఎద్దేవా చేశారు.
బుధవారం నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడారు. గురువారం నెల్లూరులో జగన్ పర్యటన ముగిసిన తర్వాత శుక్రవారం కాకాణి దుర్మార్గాలను బయటపెడతానని చెప్పారు. “చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, రాజ్ కెసిరెడ్డి, ధనుంజయ్ రెడ్డి ఇలా ఎంతో మంది జగన్ మాట విని జైలుపాలయ్యారు.
వాళ్ల కుటుంబసభ్యులను పరామర్శించకుండా కాకాణినే ఎందుకు పరామర్శించడానికి వస్తున్నారు? పాపాలు చేసిన వారిని అరెస్టు చేస్తే వాళ్లని చూడటానికి వస్తున్నారు. రెచ్చగెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకే పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు”అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చెప్పారు.