Google Doodle: గూగుల్ డూడిల్ ఉత్సవం! ఇడ్లీ కి గ్లోబల్ గుర్తింపు!

బంగ్లాదేశ్‌లో చేపలలో హిల్సా అనే చేప చాలా ప్రసిద్ధి చెందింది. హిల్సా ఎక్కువగా బంగ్లాదేశ్‌లోనే అధికంగా ఉత్పత్తి అవుతుంది ఈ చేపకు ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. 2017లో హిల్సాకు జియోగ్రాఫికల్ ఇండికేటర్ (GI) గుర్తింపు ఇచ్చారు. ఈ కారణంగా హిల్సా చేప ప్రత్యేకంగా గుర్తింపు పొందినది. స్థానికంగా ఈ చేపను “డార్లింగ్ ఆఫ్ వాటర్స్” లేదా “ప్రిన్స్ ఎమాంగ్ ఫిష్” అని కూడా పిలుస్తారు.

Indigo flight: ఇండిగో విమానానికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం..! పైలట్ అప్రమత్తతతో..!

బంగ్లాదేశ్‌లో హిల్సా చేప ప్రధానంగా అక్టోబర్ నెలలో సంతానోత్పత్తి చేస్తుంది. ఈ సమయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటుంది. చేపలు సురక్షితంగా పెరుగేలా, వేట చేసేవారిని నియంత్రించేలా పలు చర్యలు చేస్తారు. ప్రధానంగా పద్మా నదిలో హిల్సా చేపలు తన సంతానోత్పత్తి  చేస్తాయి. 2012 నుండి బంగ్లాదేశ్ ప్రభుత్వం హిల్సా చేపలను ఎగుమతించడం నిషేధించింది.

Modi: ఈనెల 16న కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు.. ఉదయం 7.50కి ఢిల్లీ నుండి!

అయినప్పటికీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వారం రోజుల పాటు పరిమితంగా హిల్సా చేపలను భారత్‌కు ఎగుమతి చేస్తారు.  దేవీ నవరాత్రుల సమయంలో కొన్ని రోజుల పాటు ఈ నిషేధాన్ని తాత్కాలికం చేస్తారు. ఈ ఏడాది దసరా సందర్భంగా 1200 టన్నుల హిల్సా చేపలను భారత్‌కు ఎగుమతి చేశారు. భారత్‌లో కూడా హిల్సా చేపకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా కోల్‌కతా మార్కెట్లో కిలో వెయ్య  రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు ధర ఉంది.

ఆ ప్రాంతాన్ని డిజిటల్ రాజధానిగా తీర్చిదిద్దే లోకేష్ ప్లాన్! రూ.1,500 కోట్లతో ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్‌.. అక్కడే ఫిక్స్!

హిల్సా చేపల వేటను నియంత్రించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 4 నుండి 25 వరకు మూడు వారాల పాటు నిషేధం విధించింది. ఈ సమయంలో చేపల వేటను ఆపడానికి పోస్టర్లు, కరపత్రాలు, మార్కెట్లలో లౌడ్‌స్పీకర్లతో ప్రజలకు తెలియజేశారు. స్థానిక పోలీసులు, నేవీ కోస్ట్‌గార్డ్, ఎయిర్ ఫోర్స్ పాల్గొని పెద్ద ఆపరేషన్ నిర్వహించారు. తీర ప్రాంతాల్లో 17  యుద్ధనౌకలు పెట్రోలింగ్ హెలికాప్టర్లను మోహరించారు.

Rishab Shetty: రికార్డుల వేటలో రిషబ్ శెట్టి! బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము రేపుతున్న కాంతారా ఛాప్టర్1 !

ప్రాంతీయ నదులు, సముద్రాల్లో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేపట్టారు. సముద్రంలోకి స్థానికులు, విదేశీ మత్స్యకారులు చొరబడకుండా చూసారు. ఈ ఆంక్షలను ఉల్లంఘించిన 100 మందిని అరెస్ట్ చేశారు. అలాగే పటువాఖాలీలో దాదాపు 80 వేల మంది మత్స్యకారులకు నిషేధిత కాలంలో 25 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు.అయితే ఇదే హిల్సా ఆంధ్రప్రదేశ్‌లో  పులస అని పిలుస్తారు. ముఖ్యంగా గోదావరి నదిలో ఈ చేప ఎక్కువగా లభిస్తుంది. పులస చేప సీజనల్‌గా మాత్రమే వస్తుంది. ఇది రుచికరమైన చేపగా ప్రసిద్ధి చెందింది.  దసరా, సంక్రాంతి సమయాల్లో లభిస్తుంది   

Education: చదువు మధ్యలో మానేసిన వారికి మరో అవకాశం..! ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త పథకం..!
Happy Nest: హ్యాపీ నెస్ట్ నిర్మాణం ఊపందుకుంది.. 12 టవర్లలో 1200 ఫ్లాట్లు!
చైనా దూకుడు వైఖరిపై ట్రంప్ ఆగ్రహం.. సాఫ్ట్‌వేర్‌ల ఎగుమతిపై అమెరికా ఆంక్షలు!!
Earn From Home: ఈ కోర్స్ నేర్చుకుంటే చాలు! ఇంట్లో ఉండే నెలకు రూ.30 వేల లక్ష వరకు సంపాదించవచ్చు!
ఫౌజీ క్రేజీ అప్‌డేట్.. డార్లింగ్ ఇలా కూడా ట్రై చేస్తున్నాడా?